Mitchell starc Alyssa Healy: అది 2023 వన్డే వరల్డ్ కప్.. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 240 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అప్పటిదాకా టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఫైనల్లో మాత్రం తడబడింది. ఈ మ్యాచ్లో గిల్, రాహుల్, షమీ వికెట్లను స్టార్క్ పడగొట్టాడు. 10 ఓవర్లు వేసిన అతడు 55 పరుగులు ఇచ్చి మూడు వికెట్ల సొంతం చేసుకున్నాడు.
వాస్తవానికి ఈ మ్యాచ్లో టీమిండియా 240 పరుగులకు ఆల్ అవుట్ కావడం వెనుక స్టార్క్ కీలక పాత్ర పోషించాడు. స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ వేయడంతో ఆస్ట్రేలియా మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు అప్పర్ హ్యాండ్ కొనసాగించింది.. బౌలింగ్లో స్టార్క్ అదరగొడితే.. బ్యాటింగ్లో హెడ్ సత్తా చూపించాడు. 120 బంతులు ఎదుర్కొన్న అతడు 137 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. స్టార్క్ ప్రదర్శన పట్ల అప్పట్లో ఆస్ట్రేలియా మీడియా ప్రముఖంగా కథనాలను ప్రసారం చేసింది. ఇప్పుడు స్టార్క్ ప్రస్తావన తీసుకురావడానికి ఓ కారణం ఉంది.
ప్రస్తుతం భారతదేశం వేదికగా మహిళల వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. విశాఖపట్నం వేదికగా భారత్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 330 పరుగులకు ఆల్ అవుట్ అయింది. వాస్తవానికి ఈ పరుగులు ఈ మైదానం మీద ఎక్కువ స్కోరే. ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో టీమ్ ఇండియా పూర్తిగా విఫలమైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ హీలి 107 బంతుల్లో 21 ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 142 పరుగులు చేసింది. తద్వారా ఆస్ట్రేలియా జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. తొలి వికెట్ కు లిచ్ ఫీల్డ్ తో కలిసి 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. పెర్రితో కలిసి రెండో వికెట్ కు 69 పరుగులు, ఐదో వికెట్ కు గార్డ్ నర్ తో కలిసి 95 పరుగులు జోడించి.. ఆస్ట్రేలియా విజయంలో ప్రధాన భూమిక పోషించింది.
హీలి స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. హీలి మరెవరో కాదు. ఆస్ట్రేలియా బౌలింగ్ దళంలో కీలకమైన స్టార్క్ సతీమణి.. ఆమె అలా బ్యాటింగ్ చేయడంలో.. వికెట్ కీపింగ్ చేయడంలో స్టార్క్ పాత్ర ఎంతో ఉంది. స్టార్క్ అప్పుడప్పుడు ఆస్ట్రేలియా జట్టుకు కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. తనకు ఎదురైన అనుభవాన్ని భార్యతో నిత్యం పంచుకునేవాడు. అందువల్ల హీలి ఆస్ట్రేలియా మహిళల జట్టుకు సారథి అయింది. భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి.. గెలుపులో ముఖ్యపాత్ర పోషించింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో స్టార్క్ హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఇప్పుడు అతడి భార్య హీలి 2025 మహిళల వన్డే వరల్డ్ కప్ లో 142 పరుగులు చేసి అదరగొట్టింది.