Homeఅంతర్జాతీయంAmerica Abraham Accords Pakistan: అమెరికా అబ్రహం అకార్డ్స్.. నవరంధ్రాలు మూసుకున్న పాకిస్థాన్

America Abraham Accords Pakistan: అమెరికా అబ్రహం అకార్డ్స్.. నవరంధ్రాలు మూసుకున్న పాకిస్థాన్

America Abraham Accords Pakistan: అమెరికాను నమ్మి బాగుపడినట్టు ఈ ప్రపంచ చరిత్రలో ఏ దేశానికీ లేదు. అమెరికా అనేది అవసరాల ఆధారంగా నడుచుకునే దేశం. తనకు ప్రయోజనాలు ఉన్నాయనుకుంటే ఎక్కడి దాకైనా వెళ్తుంది. ఏమైనా చేస్తుంది. ఇతర దేశాల పరిపాలనలో కూడా వేలు పెడుతుంది. అవసరమైతే ఆ దేశాల అధ్యక్షులను అపహరిస్తుంది. తన ప్రయోజనాల వరకే ఇతర దేశాలతో అమెరికా ప్రయాణం సాగిస్తుంది. ఆ తర్వాత దూరం పెడుతుంది. అవసరమైతే ఇంకా ఎంతకైనా తెగిస్తుంది.

పాకిస్థాన్ తో కొంతకాలంగా అమెరికా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. ఆ మధ్య పాకిస్థాన్ సైనికాధ్యక్షుడు అసిమ్ మునీర్ అమెరికా వెళ్లాడు. ట్రంప్ ను కలిశాడు. కొన్ని రంగుల బాక్సులు ఇచ్చాడు. వాటిని చూసిన ట్రంప్ ఆనందంతో ఎగిరి గంతులు వేశాడు. పాకిస్థాన్ లో వెంటనే మైనింగ్ మొదలు పెడుతున్నానని సంకేతాలు ఇచ్చాడు. ఇంతవరకు అక్కడ మైనింగ్ మొదలు కాలేదు. అమెరికా అక్కడ అడుగు పెట్టింది కాబట్టి.. ఇతర దేశాలు అటువైపు చూడలేవు. పైగా అమెరికా తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే అక్కడ మైనింగ్ షురూ చేస్తుంది.

తమతో బాగానే ఉంటోందని పాకిస్థాన్ జబ్బలు చరుచుకుంటున్నది. కానీ అసలు విషయం పాకిస్థాన్ కు ఇప్పుడు అర్థమైంది. అదును చూసి పాకిస్థాన్ ను అమెరికా గట్టి దెబ్బకొట్టింది. అబ్రహం అకార్డ్స్ ను తెరపైకి తీసుకొచ్చి పాకిస్థాన్ కు షాక్ ఇచ్చింది. అబ్రహం అకార్డ్స్ అంటే.. పచ్చిమాసియా దేశాలతో కలిసి పని చేయడం.. ఇందులో ఇజ్రాయిల్ కూడా ఉంటుంది.. ఇజ్రాయిల్ ఉండడం ముస్లిం దేశాలకు ఏమాత్రం నచ్చదు. కానీ ఇప్పుడు అమెరికా ఒత్తిడి తీసుకొస్తుంది కాబట్టి తప్పదు. అబ్రహం అకార్డ్స్ ను 2020లో తెరపైకి తీసుకొచ్చారు. పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితులను మెరుగు పరిచేందుకు.. రాజకీయంగా, దౌత్యపరంగా పరిస్థితులను చక్క దిద్దడానికి అబ్రహం అకార్డ్స్ ను రూపొందించారు. అమెరికా ఇందులో మధ్యవర్తిత్వపాత్ర పోషించింది. ఇజ్రాయిల్ తో సంబంధాలు పెంపొందించుకోవాలని అమెరికా పదేపదే ప్రస్తావించింది. ఇది ముస్లిం దేశాలకు ఏమాత్రం నచ్చడం లేదు.

నాడు అమెరికా మధ్యవర్తిత్వంలో రూపొందించిన ఒప్పందాలపై మొరాకో, సుడాన్, బహ్రేయిన్, యూఏఈ వంటి దేశాలుసంతకాలు చేశాయి. అబ్రహం అకార్డ్స్ ను ఏకంగా అరబ్ దేశాలకు విస్తరించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇజ్రాయిల్ పాలస్తీనా పై విపరీతంగా దాడులు చేయడం.. గాజా నగరాన్ని నరకంగా మార్చడంతో అబ్రహం అకార్డ్స్ ను మిగతా ముస్లిం దేశాలు ఎలా స్వీకరిస్తాయో తెలియడం లేదు. ఇజ్రాయిల్ వ్యవహార శైలి నేపథ్యంలో తాము దౌత్య పరమైన సంబంధాలు కొనసాగించలేమని సౌదీ అరేబియా అనేక సార్లు వివరించింది.

అబ్రహం అకార్డ్స్ ను 2020లో నాటి పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత షహబాజ్ షరీఫ్ కూడా అబ్రహం అకార్డ్స్ కు సమ్మతి వ్యక్తం చేయలేదు. ఇజ్రాయిల్ ను తాము గుర్తించబోమని ఆయన పదే పదే స్పష్టం చేశారు. ఇటీవల ఇరాన్ , అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదర్చడానికి పాకిస్థాన్ ప్రయత్నాలు చేసింది. సరిగ్గా ఇప్పుడు దీనిని ట్రంప్ పాకిస్థాన్ ముందు పెడుతున్నారు.ఒకవేళ పాకిస్థాన్ కనుక సంతకాలు పెడితే అంతే సంగతులు. ఇది ఆర్థికంగా.. భద్రతపరంగా.. రాజకీయపరంగా పాకిస్తాన్ దేశానికి అనేక రకాల చిక్కులు తెచ్చిపెడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఒత్తిడి నేపథ్యంలో పాకిస్తాన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper