Afghanistan: అప్గన్ లో భారతీయులపై పడుతోన్న తాలిబన్లు,, వ్యాపారి కిడ్నాప్ కలకలం

Afghanistan: తాలిబన్ల ఆగడాలు పెరుగుతున్నాయి. వారి రాక్షస పాలనపై ఇప్పటికే పలు విమర్శలు రాగా ప్రస్తుతం వారిలో రాక్షస పాలన తాలూకు ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ప్రపంచం మొత్తం వారి గురించి భయాలు నిజం అవుతున్నాయి. తాజాగా భారతీయ వ్యాపారిని కిడ్నాప్ చేసి వారిలోని నైజాన్ని ప్రదర్శించారు. భారతీయ సిక్ వర్గానికి చెందిన ఓ వ్యాపారిని తుపాకులతో బెదిరించి కిడ్నాప్ కు పాల్పడడం సంచలనం సృష్టిస్తోంది. వ్యాపారి అపహరణకు గురైన విషయాన్న ఇండియన్ వరల్డ్ ఫోరం అధ్యక్షుడు పునీత్ […]

Written By: Srinivas, Updated On : September 15, 2021 3:19 pm
Follow us on

Afghanistan: తాలిబన్ల ఆగడాలు పెరుగుతున్నాయి. వారి రాక్షస పాలనపై ఇప్పటికే పలు విమర్శలు రాగా ప్రస్తుతం వారిలో రాక్షస పాలన తాలూకు ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ప్రపంచం మొత్తం వారి గురించి భయాలు నిజం అవుతున్నాయి. తాజాగా భారతీయ వ్యాపారిని కిడ్నాప్ చేసి వారిలోని నైజాన్ని ప్రదర్శించారు. భారతీయ సిక్ వర్గానికి చెందిన ఓ వ్యాపారిని తుపాకులతో బెదిరించి కిడ్నాప్ కు పాల్పడడం సంచలనం సృష్టిస్తోంది.

వ్యాపారి అపహరణకు గురైన విషయాన్న ఇండియన్ వరల్డ్ ఫోరం అధ్యక్షుడు పునీత్ సింగ్ చంధోక్ ధ్రువీకరించారు. ఆయనను విడిపించడంలో దేశం జోక్యం చేసుకోవాలని కోరారు. భారత విదేశాంగ శాఖ అధికారులు ఆయన విడుదలకు సహకరించాలని విన్నవిస్తున్నారు. అయితే అపహరణకు గురైన వ్యాపారి పేరు బన్ శ్రీ లాల్. వయసు 50 సంవత్సరాలు. రాజధాని కాబుల్ పర్వాన్ లోని ఖోస్త్ లో ఉంటున్నారు.

ఆయన కుటుంబం మొత్తం ఢిల్లీలో ఉంటోంది. చాలా కాలం కిందటే ఆయన కాబుల్ లో స్థిరపడ్డారు. కెమికల్ బిజినెస్ చేస్తున్నారు. ఆయన వద్ద భారతీయ పాస్ పోర్టు ఉంది. తాలిబన్లు అందరిని తనిఖీ చేస్తున్న క్రమంలో భారతీయ పాస్ పోర్టు కలిగిన ఆయనను పట్టుకుని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. తుపాకీతో బెదరించి అపహరించినట్లు సమాచారం. టయోటా కరోలా కారులో గుర్తుతెలియని ప్రదేశానికి అపహరించినట్లు తెలుస్తోంది.

బన్ శ్రీ లాల్ ను విడిపించడంలో భారత ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నారు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఆయనను విడిపించే విషయంలో విదేశాంగ శాఖ అధికారులు ఖతర్ ప్రభుత్వ సహాయం తీసుకుంటామని చెబుతున్నారు. తాలిబన్ల పాలనతో ఇంకా ఎన్ని ఘోరాలు జరుగుతాయో అని భయపడుతున్నారు.