ఏపీలో రోడ్లు దారుణంగా దెబ్బ తిన్నాయి. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ రోడ్ల దుస్థితిపై దృశ్యాలు పోస్టు చేసి ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. టీడీపీ సైతం రోడ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు తన వాణి వినిపిస్తూనే ఉంది. కానీ నిధులు మొత్తం సంక్షేమ పథకాల్లో పెట్టిన సీఎం జగన్ అభివృద్ధిపై ఒక్క పైసా కూడా కేటాయించడం లేదు. రోడ్లు మొత్తం కొట్టుకుపోయి బీటలు వారుతున్నాయి.
అధికారం చేపట్టాక జగన్ రోడ్లను గురించి పట్టించుకోవడం లేదు. ఫలితంగా అధ్వాన స్థితి చేరుకున్నాయి. రోడ్లపై ఎవరైనా గర్భిణీ ప్రయాణం చేస్తే తేలిగ్గా ప్రసవం అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో రోడ్ల ఫొటోలు పోస్టులు పెడుతూ వైరల్ చేస్తున్నారు. గతుకుల రోడ్ల మీద జగన్ ప్రయాణం చేసి చూడాలని సలహాలు ఇస్తున్నారు. విపక్షాలు చేస్తున్న చాలెంజ్ ను ప్రభుత్వం నిర్లక్ష్యంగా తీసుకుంటోందని విమర్శలు వస్తున్నాయి.
రోడ్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల చేయడం లేదు. వాటిని బాగు చేయడం లేదు. సామాన్యుల గురించి ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రశ్నిస్తున్నారు. గోతుల రోడ్లను బాగు చేయడానికి ప్రభుత్వం మాత్రం ముందుకు రావడం లేదు. ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నా జగన్ మాత్రం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదని ఘోషిస్తున్నారు.