India Vs China: గతంలో గాల్వాన్ లోయ లో చైనా దాష్టికానికి పాల్పడింది. ఆ తర్వాత మన సైనికులు తిప్పి కొట్టడంతో తోక ముడిచింది. ఇక అనేక సందర్భాల్లో మనదేశంలోకి ప్రవేశించేందుకు ఏదో ఒక మార్గంలో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీనిని మన దేశం తిప్పికొడుతూనే ఉంది. పైగా అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న భారత సరిహద్దు గ్రామాలను ఆక్రమించేందుకు చైనా ఎప్పటినుంచో పన్నాగం పన్నుతోంది. పైగా ఆ గ్రామాలను తమ దేశంలో ఉన్నట్టుగా మ్యాప్ కూడా మార్చింది. దీనిపై భారత్ అనేక వేదికల వద్ద అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి తీవ్రంగా పరిగణించడంతో చైనా కాస్త వెనక్కి తగ్గింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ హల్ చల్ చేస్తోంది. ఆ ఫోటోలో భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ముందు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మోకరిల్లినట్టు కనిపిస్తున్నారు. ఆయన భారత్ – చైనా సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతంలో 90 వేల చదరపు కిలోమీటర్ల భూమిని భారతదేశానికి బంగారు పళ్లెంలో పెట్టి అప్పగిస్తున్నట్టు చైనీస్ సోషల్ మీడియాలో ఒక కార్టూన్ తెగ చక్కర్లు కొడుతోంది. ఆ కార్టూన్ ప్రకారం చైనా భారత్ కు అప్పగించిన భూమి పరిమాణం దాదాపు 2.5 తైవాన్ దీవులతో సమానం. లేదా మూడు హైనాన్ దీవులకు దగ్గరగా ఉంటుంది. అయితే ఈ కార్టూన్ కొద్దిరోజులుగా చైనీస్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
రంగంలోకి దిగిన చైనా
ఈ కార్టూన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనిని అడ్డుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈ కార్టూన్ షేర్ చేస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసింది. అంతేకాదు ఈ సమాచారాన్ని అడ్డుకోవడానికి ఏకంగా సెన్సార్ నిబంధనను తెరపైకి తీసుకువచ్చింది. ” ఇలాంటి కార్టూన్ రూపొందించడం సరైనది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దు. అలా షేర్ చేసిన వారు ఇబ్బందుల పాలవుతారు. ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని” చైనా పోలీస్ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా సోషల్ మీడియా సంస్థలకు కూడా నోటీసు జారీ చేసింది. కాగా, ఈ కార్టూన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండడం పట్ల చైనాలోనూ రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి..”కచ్చితంగా భారత్ అంతర్జాతీయంగా చైనాపై ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. అందువల్లే ఇలాంటి కార్టూన్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ కార్టూన్ సరికొత్త అనుమానాలకు దారితీస్తోంది. మొత్తంగా చూస్తే చైనా ను ప్రతిఘటించే శక్తి అమెరికాకు లేదు. భారత్ కు మాత్రమే ఉంది. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నంతకాలం ఆ దేశానికి ఆ శక్తి ఉంటుందని” చైనా నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
According to rumours on Chinese social media,President Xi allegedly handed over 90,000 sq km land in disputed border to India,which is said to be equivalent to 2.5 Taiwan Islands and nearly 3 Hainan Islands.
Chinese govt is actively censoring this.
Chinese cartoon depicts same. pic.twitter.com/4xqaVBv19D
— TRUTIYA NAYAN (@TrootiyaNayaan) October 30, 2024