Homeఅంతర్జాతీయంRebellion in Pakistan: పాకిస్తాన్ లో తిరుగుబాటు మొదలైంది

Rebellion in Pakistan: పాకిస్తాన్ లో తిరుగుబాటు మొదలైంది

Rebellion in Pakistan: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్, ఖైబర్‌ పక్తూన్ఖ్వా, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ ప్రాంతాల్లో వేర్పాటు ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. దీంతో పాకిస్తాన్‌ ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. బలూచిస్తాన్‌ అయితే పాకిస్తాన్‌ పాలనలో లేదు. ఇక ఖైబర్‌ ఫక్తూన్ఖ్వాలో తెహ్రీక్‌ ఎ తాలిబాన్‌ పాకిస్తాన్‌ దెబ్బకు అక్కడి విధులు నిర్వహించడానికి సైనికులు భయపడుతున్నారు. 8 నెలలుగా అటువైపు వెళ్లడంలేదు. తాజాగా స్వతంత్ర పోరాటం ఉధృతమైంది. ఈ అస్థిరత పాకిస్తాన్‌ భౌగోళిక సమగ్రతను సవాలు చేస్తోంది.

సింధ్‌ ఉద్యమం పునరుజ్జీవనం
సింధ్‌ ప్రాంతంలో ’సింధుదేశ్‌’ అనే స్వాతంత్య్ర ఉద్యమం ఊపందుకుంది. సంస్కృత మూలాలు కలిగిన ’సింధ్‌’ పేరుతో డిసెంబర్‌ మొదటి ఆదివారం ’సింధ్‌ సాంస్కృతిక దినోత్సవం’ జరుపుకుంటున్నారు. 2009 నుంచి కొనసాగుతున్న ఈ కార్యక్రమాల్లో తాజా సమావేశంలో స్వంత సంస్కృతి రక్షణ, బాహ్య ప్రభావాల నుంచి రక్షణ కోరుకున్నారు. సాంప్రదాయ అద్దంకి వస్త్రాలు, ప్రత్యేక టోపీలు ధరించి, నృత్యాలు, గీతాలతో పాల్గొన్నారు.

ముత్తాహిదా మహజ్‌ నాయకత్వం
ముత్తాహిదా మహజ్‌ సంస్థ నేతృత్వంలో ’సింధ్‌ జో జమాలో’ అనే నినాదంతో ర్యాలీలు నిర్వహించారు. తమ భూమి, నీటి వనరులపై అధికారం కావాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు కాల్పులు జరపగా, ప్రజలు రాళ్లు విసిరి ప్రతిఘటించారు – దీంతో మరణాలు, గాయాలు సంభవించాయి.

1967 నుంచి పోరాటం..
1967లో జీఎం సయ్యద్‌ స్వతంత్ర పోరాటం ప్రారంభించాడు. ఈయన ఓటు 1947 ఓటింగ్‌లో కీలకంగా మారింది. సమాన ఓట్లు పడినప్పుడు స్పీకర్‌గా ఉన్న సయ్యద్‌ కీలక ఓటుతో సింధ్‌ను పాకిస్తాన్‌లో చేర్చాడు. తర్వాత స్వాతంత్య్ర పోరాటానికి ఆయన నాయకత్వం వహించగా, జైలు శిక్ష అయింది. ఇప్పుడు షఫీ ముఫాద్‌ ఐక్యరాష్ట్ర సమితిలో స్వతంత్ర దేశ డిమాండ్‌ చేశారు. అల్తాఫ్‌ హుస్సేన్, ఎంక్యూఎం నాయకుడు కూడా ఇస్లామాబాద్‌కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

తాజా పోరాటాలతో త్వరలోనే పాకిస్తాన్‌ మ్యాప్‌ మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ పోరాటాలకు భారత్‌ మద్దతు ఇస్తే.. పాకిస్తాన్‌ మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version