White Sharks: సముద్రంలో భయానక వేట ఒకటి వీడియోకు చిక్కింది. తిమింగాలు, సొర చేపలను డ్రోన్ సాయంతో వీడియో తీస్తున్న ఒక టీవీ కార్యక్రమం కోసం తీస్తున్న వేళ మూడు కిల్లర్ తిమింగలాలు ఒక తెల్లటి సొరచేప ను చంపి కేవలం కాలేయం తిన్న దారుణ ఘటన వీడియోలో చిక్కింది. మూడు కిల్లర్ తిమింగలాలు ఒక తెల్ల సొరచేపను చీల్చివేసి, నీటిని రక్తంతో నింపేసిన క్షణాన్ని చూపించే భయానక దృశ్యాలు డ్రోన్ కెమెరాలో చిక్కాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.. షాకింగ్ వీడియో డిస్కవరీ నెట్‌వర్క్ యొక్క 34వ వార్షిక షార్క్ వీక్‌లో ప్రదర్శించారు.

దక్షిణాఫ్రికాలోని మోసెల్ బేలో సముద్ర తీరంలో తెల్లటి అరుదైన షార్క్ జాతులు అంతరించిపోతున్నాయి. అవి ఎలా చనిపోతున్నాయన్నది ఎవరికీ అంతుబట్టలేదు. ఈ క్రమంలోనే ‘షార్క్ వీక్’ కోసం చిత్రీకరిస్తున్నప్పుడు ఓర్కాస్ ప్యాక్ అనే గొప్ప తెల్ల షార్క్ జాతి కనిపించింది. దాన్ని చుట్టూ డ్రోన్ తో తెరకెక్కిస్తుండగా.. మూడు కిల్లర్ తిమింగలాలు దాని చుట్టూ వచ్చాయి. షార్క్ కడుపుభాగంలో దాడి చేసిన హింసాత్మక క్షణాన్ని డ్రోన్ కెమెరా చిత్రీకరించింది. వీడియోలో షార్క్ యొక్క కాలేయాన్ని తినడానికి అక్కడే దాడి చేసిన కిల్లర్ తిమింగలం వీడియోకు చిక్కింది. ఆ సమయంలో సముద్రం షార్క్ రక్తంతో నీరు ఎర్రగా మారిపోయింది. రక్తం చిమ్మేసినట్టైంది. మరో రెండూ తిమింగళాలు షార్క్ ను చుట్టుముట్టాయి.
“ఈ వీడియో ప్రసారం అయిన తర్వాత, అది వైరల్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. ఇది ఇప్పటివరకు సముద్రంలో చిత్రీకరించబడిన సహజ వీడియోలలో అత్యంత అరుదైన వాటిల్లో ఒకటి” అని దక్షిణాఫ్రికాకు చెందిన శాస్త్రవేత్త అలిసన్ టౌనర్ చెప్పారు. దక్షిణాఫ్రికా సముద్రంలో తెల్లటి షార్క్ లు ఎలా మాయపోతున్న వాటికి ఈ వీడియోతో సమాధానం దొరికింది. ఈ షార్క్ ల కాలేయం రుచికరంగా ఉంటుందని తిమింగలాలు వాటిని చంపి తింటున్నట్టు తెలుస్తోంది.
సముద్ర జీవశాస్త్రవేత్త ఈ క్లిప్ ఇప్పటివరకు సంగ్రహించబడిన సహజ చరిత్రలోని అత్యంత అద్భుతమైన ముక్కలలో ఒకటి” అని పేర్కొన్నాడు. ఒకప్పుడు ప్రపంచానికి షార్క్ రాజధానిగా ఉన్న ఈ ప్రాంతం నుండి ఇప్పుడు ఎందుకు అంతరించిపోయాయో తెలిసిందని ఈ ఫుటేజ్ చూస్తే అర్థమవుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు..
2019 నివేదికల ప్రకారం, దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ తీర ప్రాంతంలో అరుదైన గొప్ప తెల్ల సొరచేపలు రహస్యంగా మాయమవుతున్నాయి. 2010 మరియు 2016 మధ్య షార్క్ స్పాటర్లు అట్లాంటిక్ మహాసముద్రంలోని 600 చదరపు మైళ్ల విభాగంలో సంవత్సరానికి సగటున 205 గొప్ప తెల్ల సొరచేపలు కనిపించేవి. అయితే 2018లో కేవలం 50 మాత్రమే నమోదయ్యాయి. ఈ సంవత్సరం, ఇప్పటివరకు, ఒక్క గొప్ప తెల్ల సొరచేప కూడా కనిపించలేదు. కాలుష్యం, శీతోష్ణస్థితి మార్పుతో పాటు వాటి సహజ ఆహారమైన అధికంగా చేపలు పట్టడం కూడా షార్క్ లు అంతరించడం వెనుక కారణాలుగా అనుకున్నారు.
కానీ ఇప్పుడు తేలింది ఏమింటంటే.. తెల్లటి షార్క్ ల కాలేయం కోసం తిమింగలాలు వాటి కడుపు చీల్చి తింటున్నాయి. తిమింగలాల సమూహాల నుండి అవి పారిపోతున్నాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. “తెల్ల సొరచేపలను చంపడానికి కిల్లర్ తిమింగలాలు కారణమని మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ తెల్ల సొరచేప కంటే ముందు ఉన్న కిల్లర్ వేల్స్‌కి సంబంధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రోన్ ఫుటేజ్” ఇది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వీడియో