https://oktelugu.com/

Kim And Putin: కిమ్, పుతిన్‌ మధ్య డేంజర్‌ డీల్‌.. ఇక అమెరికాకు దబిడి దిబిడే..!

ప్రపంచ ప్రజలు శాంతి కోరుకుంటుంటే.. అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్, రష్యా, ఉత్తర కొరియా లాంటి దేశాధినేతలు మాత్రం యుద్ధం కోరుకుంటున్నారు. వీరి యుద్ధ కాంక్ష కారణంగా ఏళ్లుగా ఉద్రిక్త పరిస్థితులే కనొసాగుతున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 5, 2024 / 11:25 AM IST

    Kim And Putin

    Follow us on

    Kim And Putin: ప్రపంచంలో ఇప్పటి వరకు రెండు భారీ యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాల కారణంగా రెండు వర్గాలుగా విడిపోయిన దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. గెలుపోటములు పక్కన పెడితే.. ఆ యుద్ధాల ప్రభావం ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఉంది. దీంతో యావత్‌ ప్రపంచం ప్రస్తుతం యుద్ధాలను కోరుకోవడం లేదు. ప్రజలు యుద్ధం అంటేనే భయపడుతున్నారు. ఈ తరుణంలో మూడో ప్రపంచ యుద్ధం మొదలైందని కొందరు వాదనలు చేస్తున్నారు. ఉక్రెయిన్‌–రష్యా సుదీర్ఘ యుద్ధం, ఇజ్రాయెల్, హమాస్, లెబనాన్, ఇరాన్‌ మధ్య జరుగుతున్న యుద్ధం.. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలోకి ఉత్తర కొరియా ఎంటర్‌ కావడం వంటి పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతంగా చెబుతున్నారు. ఈ తరుణంలో రష్యా, ఉత్తర కొరియా మధ్య మరో కీలక ఒప్పందం జరిగింది.

    అమెరికాకు వ్యతిరేకంగా..
    ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధ పరంగా, ఆర్థికంగా సాయం చేస్తూ.. యుద్ధాని ప్రోత్సహిస్తోంది. ఇది జగమెరిగిన సత్యం. అమెరికాతోపాటు ఫ్రాన్స్, బ్రిటన్, నాటో దేశాలు కూడా అమెరికావైపే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు వ్యతిరేక కూటమి ఏర్పడుతోంది. రష్యా నేతృత్వంలో ఈ కూటమి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగానే రష్యా, ఉత్తర కొరియా మధ్య కీలక మిలిటరీ ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని నార్త్‌ కొరియాకు చెందిన అధికారిక న్యూస్‌ ఏజెన్సీ కేసీఎన్‌ఏ ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మిలటరీ తమకు అవసరమైన సమయాల్లో సాయం చేసుకుంటాయి.

    అమలులోకి ఒప్పందం..
    రష్యా, ఉత్తర కొరియా మధ్య కుదిరిన ఒప్పందం అమలులోకి వచ్చింది. పరస్పరం మిలిటరీ సాయం చేసుకోవడానికి ఈ ఏడాది జూన్‌లోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే పశ్చిమాసియా విధించే ఆంక్షలను సంయుక్తంగా ఎదుర్కొనడం, ఆపత్కాలంలో తక్షణ మిలిటరీ సాయం చేసుకునేలా ఈ ఒప్పందం జరిగింది. ఇక అన్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియా తన బలగాలను ఇప్పటికే రష్యా పంపించి సాయం చేస్తోందని అమెరికా, ఉక్రెయిన్‌ ఆరోపిస్తున్నాయి.
    ఉత్తర కొరియాకు టెక్నాలజీ..
    ఉత్తర కొరియా, రష్యా మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా.. రష్యా ఆధునిక టెక్నాలజీని ఉత్తర కొరియాకు అందిస్తుంది. యుద్ధంలో పాల్గొనడం ద్వారా ఉత్తర కొరియా సైనికులు రాటుదేలుతారని భావిస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే వేల మంది యుద్ధంలోకి దిగారు. పుతిన్‌ బలగాలకు సాయం చేస్తున్నారు.