Zimbabwe Measles: 2020 సంవత్సరంలో ఎప్పుడైతే ప్రపంచంపైకి కరోనా వచ్చిందో అప్పటి నుంచి కొత్త కొత్త మహమ్మారులు పుట్టుకొచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కరోనా తర్వాత మంకీపాక్స్, ఒమిక్రాన్ రూపాంతరం చెందిన వేలమంది ప్రాణాలు తీసింది. ఇప్పుడు మరో మహమ్మారి విజృంభించి ప్రాణాలు తీస్తోంది.

మన చిన్నప్పుడు 80,90వ దశకాల్లో గ్రామాల్లో ప్రబలిన అమ్మవారు, తట్టునే ఇప్పుడు ఆఫ్రికా దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. జింబాబ్వేలో ‘మీజిల్స్’ వ్యాధి విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడిన వారిలో 700 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 1న ఒక్కరోజే జింబాబ్వేలో 37 మంది చిన్నారులు మృతిచెందడం.. తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. ఈ ఏప్రిల్ లో తొలి కేసు నమోదు కాగా.. ఇప్పుడు నెలల వ్యవధిలోనే దేశమంతా వ్యాపించింది. ఇప్పటివరకూ 6291 కేసులు నమోదయ్యాయి. మరణాల రేటు ఎక్కువవుతోంది.

ఇది ప్రపంచంపైకి మరో మహమ్మారిలో విస్తరించే ప్రమాదం ఉందని.. అందరూ చిన్నపిల్లలకు మీజిల్స్ టీకా ఇప్పించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. దీనికి మందులు లేవని.. టీకా ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు. మీజిల్స్ వస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందంటున్నారు..
ప్రధానంగా పోషకాహారలోపంతోపాటు మీజిల్స్ టీకా తీసుకోకపోవడం వల్లే పిల్లలకు ఈ వ్యాధి సోకి మృత్యువాత పడుతున్నట్టు తేలింది.