Bus Accident in Pakistan : మొన‍్న నేపాల్‌లో.. నేడు పాకిస్తాన్‌లో.. లోయలో పడుతున్న బస్సులు.. ఆందోళనలో ప్రయాణికులు!

విమాన ప్రమాదాలకు కేరాఫ్‌ నేపాల్‌. ఏటా కనీసం నాలుగైదు విమాన ప్రమాదాలు జరుగుతాయి. ఉగ్రవాదులకు కేరాఫ్‌ పాకిస్తాన్‌.. ఏటా ఆ దేశంలో నాలుగైదు బాంబు పేలుళ్ల ఘటనలు జరుగుతాయి. ఈ మధ్య పాకిస్తాన్‌లో పడవ ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.

Written By: Raj Shekar, Updated On : August 25, 2024 7:05 pm

bus fell into valley in pakistan

Follow us on

Bus Accident in Pakistan :  భారత్‌ పొరుగున్న ఉన్న హిందూ దేశం నేపాల్‌. ముస్లిం దేశం పాకిస్తాన్‌. నేపాల్‌లో అనేక హిందూ ఆలయాలు ఉన్నాయి. ఏటా లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. భారత్‌కు చెందిన అనేక మంది దైవ దర్శనాల కోసం నేపాల్‌ వెళ్తుంటారు. ఇక పాకిస్తాన్‌లో ఎలాంటి ప్రత్యేక ప్రార్థన మందిరాలు, సందర్శన క్షేత్రాలు లేవు. ఉగ్రవాద దేశం కావడంలో అక్కడికి టూరిస్టులు కూడా తక్కువగానే వస్తుంటారు. పాకిస్తాన్‌లో భౌగోళిక పరిస్థితుల కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. డ్రైవర్‌ ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. వాహనాలు అదుపు తప్పి లోయల్లో పడిపోతుంటాయి. నేపాల్‌లోనూ ఇదే పరిస్థితి. రెండు రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బస్సు నేపాల్‌లో ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి నేపాల్‌లోని తానాహున్‌ జిల్లాలో మార్సాంగ్డీ నదిలో పడిపోయింది. వరద ఉధృతికి ఒడ్డు కొట్టుకుని వచ్చింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ టూరిస్టు బస్సు యాత్రికులతో నేపాల్‌ వెళ్లింది. గురువారం రాత్రి యాత్రికులు పోఖారాలోని మజేరి రిసార్ట్‌లో బస చేశారని, శుక్రవారం ఉదయం పొఖారా నుంచి నుంచి ఖాట్మండుకు శుక్రవారం(ఆగస్టు 23న) వెళ్తుండగా మధ్యలో తానాహున్‌ జిల్లాలోని మార్సాంగ్డి నదిలో అదుపు తప్పి పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మంది మృతిచెందినట్లు తెలిసింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది యాత్రికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అందరూ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే. తాజాగా పాకిస్తాన్‌లోనూ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలోనూ 44 మంది మరణించారు.

రెండు వేర్వేరు ప్రమాదాలు..
పాకిస్తాన్‌లో ఆదివారం(ఆగస్టు 25న) రెండు వేర్వేరురోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ రెండు ఘటనల్లో 44 మంది మరణించారు. మృతుల్లో 12 మంది టూరిస్టులు ఇరాన్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని రెస్క్యూ అధికారులు తెలిపారు. ఇక పంజాబ్ ప్రాచీన పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ మధ్య సరిహద్దులోని ఆజాద్ పళాన సమీపంలో ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 22 మంది మరణించారు. అత్యవసర సేవల ప్రతినిధి ఫరూక్‌ అమ్మద్‌ మాట్లాడుతూ మృతుల్లో 15 మంది పురుజులు, ఆరుగురు మహిళలు, ఒక పసిబిడ్డ ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

మరో ప్రమాదంలో 12 మది..
మరో ప్రమాదం బలూచిస్తాన్‌లోని మర్రిన్ కోస్టల్ హైవేపై పాకిస్తాన్ పౌరులు ఇరాన్‌లోకి వెళ్లకుండా పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. అయితే ప్రమాదకరమైన రహదారిలో పోలీసుల నుంచి తప్పించుకుని ఇరాన్‌లోకి ప్రవేశించే క్రమంలో డ్రైవర్ మితిమీరిన వేగంలో నడపడంతో బన్సు లోయలో వడింది. ఈ ప్రమాదంలో సుమారు 12 నుంచి ప్రయాణికులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.