Committee Kurrallu in OTT : మెగా డాటర్ నిహారికకు కోట్లు తెచ్చి పెట్టిన కమిటీ కుర్రోళ్ళు ఓటీటీలో… సినిమా లవర్స్ కి పండగ లాంటి న్యూస్!

తాజాగా కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ డీల్ జరిగినట్లు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కమిటీ కుర్రోళ్ళు డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం ఆహా ఎక్కువ మొత్తం చెల్లించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కమిటీ కుర్రోళ్ళు చిత్రం థియేట్రికల్ రన్ పూర్తి కాలేదు. కాబట్టి సెప్టెంబర్ రెండో వారం కమిటీ కుర్రోళ్ళు స్ట్రీమింగ్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Written By: S Reddy, Updated On : August 25, 2024 7:14 pm

Committee Kurrallu Movie in OTT

Follow us on

Committee Kurrallu in OTT : నిహారిక కొణిదెల నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆమె నిర్మించిన తొలి చిత్రం కమిటీ కుర్రోళ్ళు ఆగస్టు 9న ధియేటర్స్ లో రిలీజ్ అయింది. హిట్ టాక్ సొంతం చేసుకుంది.మొదటి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ తో ఈ చిత్రం దూసుకుపోతుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఉహించని కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 15. 6 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే తాజాగా కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ పాట్నర్ ని ఫిక్స్ చేసుకుంది.

కమిటీ కుర్రోళ్ళు సినిమా విలేజ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో రూపొందించబడింది. యదు వంశీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని అందరూ కొత్త వాళ్లతో తీయడం విశేషం. 90లలో ఉండే జ్ఞాపకాలు, స్నేహితుల బంధం, పల్లెటూరిలో జాతరలు, ఎన్నికలు వంటి అంశాలు హైలెట్ చేశారు. స్టోరీలో కొత్తదనం ఉండటంతో పాటు ఎమోషన్స్ పండాయి. దీంతో కమిటీ కుర్రోళ్ళు ఆడియన్స్ కి బాగా నచ్చింది. మూడు వారాలు గడుస్తున్నా.. కమిటీ కుర్రోళ్ళు మూవీ అక్కడక్కడా ప్రదర్శిస్తున్నారు.

తాజాగా కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ డీల్ జరిగినట్లు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కమిటీ కుర్రోళ్ళు డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం ఆహా ఎక్కువ మొత్తం చెల్లించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కమిటీ కుర్రోళ్ళు చిత్రం థియేట్రికల్ రన్ పూర్తి కాలేదు. కాబట్టి సెప్టెంబర్ రెండో వారం కమిటీ కుర్రోళ్ళు స్ట్రీమింగ్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఈ మూవీలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, మణికంఠ పరశు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, అక్షయ్ శ్రీనివాస్, టీనా శ్రావ్య, శివ కుమార్, తేజస్వి రావ్, విశిక తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే మొదట కమిటీ కుర్రాళ్ళు చిత్రాన్ని కొనుగోలు చేసినందుకు ఏ ఓటీటీ సంస్థ ముందుకు రాలేదని .. సినిమా టాక్ చూసిన తర్వాత ఓటీటీ డిమాండ్ పెరిగింది అని నిహారిక కొణిదెల ఓ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చింది.

కాగా నిహారిక అటు నటిగా ఇటు నిర్మాతగా రాణించే ప్రయత్నం చేస్తుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారికకు బ్రేక్ రాలేదు. దాంతో 2020లో వివాహం చేసుకుంది. భర్త వెంకట చైతన్యతో ఆమెకు మనస్పర్థలు తలెత్తాయి. ఈ కారణంగా విడాకులు తీసింది. తిరిగి పరిశ్రమలో అడుగుపెట్టిన నిహారిక డెడ్ పిక్సెల్స్ టైటిల్ తో వెబ్ సిరీస్ చేసింది.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో గతంలోనే నిహారిక ఓ బ్యానర్ ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో నిర్మాతగా మారాలనే ఉద్దేశంతో హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేసింది. కొత్త రచయితలు, దర్శకులు, నటులతో లో బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించే ప్లాన్ లో ఉంది. మొదటి ప్రయత్నం సక్సెస్ అయ్యింది.