Y S Sharmila: పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం ఉత్తమం. మరో ప్రస్థానం పేరుతో తెలంగాణ మొత్తం పాదయాత్ర చేస్తున్న షర్మిల ప్రస్తుతం పై సామెతను నిజం చేసే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా ఇందులో ఖమ్మం జిల్లా ఆంధ్ర సరిహద్దు ప్రాంతంగా ఉంది. ఇక్కడ 2018 లో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు చాలా విలక్షణంగా తీర్పు ఇచ్చారు. రాష్ట్రం మొత్తం గులాబీ హౌస్ సాగుతుంటే ఇక్కడ కాంగ్రెస్కు పట్టం కట్టారు. 2014లోనూ గులాబీ పార్టీ తన హవా ప్రదర్శిస్తుంటే, వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెట్టిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలిపించి మేం భిన్నం. మా తీర్పు భిన్నమని చాటిచెప్పారు. ఈ గత పరిణామాలను దృష్టిలో పెట్టుకునే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఖమ్మం జిల్లాలో ఎక్కువ రోజులు పాదయాత్ర చేస్తున్నారు. అందులో భాగంగానే పాలేరు నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు.
…
షర్మిలకు సేఫేనా
…
పాలేర్లు ఓటర్లు ఆది నుంచి కూడా భిన్న మే. ఇక్కడ ఎమ్మెల్యేగా రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి రెండు సార్లు గెలిచారు. ఒకసారి రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. అనారోగ్యం కారణంగా కన్నుమూయడంతో అప్పటిదాకా ఎమ్మెల్సీగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి భార్య మీద పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత కొద్ది రోజులకే కందాల ఉపేందర్ రెడ్డి టిఆర్ఎస్లో చేరారు. దీంతో అప్పటి నుంచి కందాల ఉపేందర్ రెడ్డి కి తుమ్మల నాగేశ్వర వర్గాలకు పడటం లేదు. కొన్ని సందర్భాల్లో అయితే రెండు వర్గాలు ఘర్షణలకు దిగుతున్నాయి. వీటిల్లో కొన్ని కేసులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నాయి. టిఆర్ఎస్ లో రెండు వర్గాలు ఉండటం, కాంగ్రెస్లో సరైన నాయకుడు లేకపోవడం తో షర్మిల చూపు పాలేరు పై పడిందని సమాచారం. అందులో భాగంగానే ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆమె యోచిస్తున్నారు. దీన్ని ప్రచారం చేసుకునేందుకు మీడియాకు లీకులు ఇస్తున్నారు. వాస్తవానికి పాలేరు నియోజకవర్గంలో ఖమ్మం రూరల్, తిరుమలాయ పాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాలు ఉన్నాయి. ఈ నాలుగు మండలాల లో మాదిగ మాల ఓట్ల తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ మాల మాదిగ సామాజిక వర్గాల్లో వైఎస్ అభిమానుల్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. పైగా వైఎస్ కుటుంబం క్రైస్తవ్యాన్ని నమ్ముకొని ఉండటంతో అది వైయస్ షర్మిలకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో కమ్మ ఓటర్లు అధికంగా ఉన్నప్పటికీ వారంతా తుమ్మలకు గంప గుత్తగా ఓటు వేసే అవకాశాలు కనిపించడం లేదు. పైగా 2019 ఎన్నికల్లో చాలామంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కందాల ఉపేందర్ రెడ్డికి జై కొట్టారు. వారివల్లే తుమ్మల నాగేశ్వరావు ఎన్ని వేల ఐదు వందల ఓట్ల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. ఇంక అప్పటి నుంచి ఇప్పటి దాకా వా నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరావు అడపాదడపా కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు. ఎందుకు 2023 లో కూడా పాల్ టికెట్ తనకు ఇప్పించాలని ముఖ్యమంత్రి దగ్గర స్పష్టమైన హామీ తీసుకొని వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్నారని ఆయన అభిమానులు చెబుతున్నారు.
…
నా పిల్లల మీద ఒట్టు నాకేం తెలీదు
..
షర్మిల పాదయాత్ర చేపట్టిన ప్రతి ప్రాంతంలోనూ అధికార టీఆర్ఎస్ పైన తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు కూడా బయ్యారం గనులను ముంచింది వైయస్ కుటుంబమెనని, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని తెలంగాణలో అడుగు పెడుతున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటికీ సమాధానం చెప్పలేక తడబడిన షర్మిల ఇటీవల కొత్త పల్లవి అందుకున్నారు. తన పిల్లల మీద ఒట్టని, తనకు బయ్యారం ఇనుప గనులు లీజు కి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి సమాధానాల ద్వారా ముఖ్యంగా పాలేరు ఓటర్ల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తనకున్న సర్వే నివేదికల ఆధారంగా పాలేరు అనుకూలంగా ఉందని తెలిసిన తర్వాత షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారని లీకులు ఇస్తున్నారు.
Also Read: Pavan With People: జనంతో నే పవన్ పొత్తు.. టీడీపీ కే బొక్కా
…
తుమ్మల పరిస్థితి ఏంటి
…
2018 ఎన్నికల తర్వాత తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గంలో అడపాదడపా కార్యక్రమాలకు హాజరవుతూనే ఉన్నారు. వాస్తవానికి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం పట్వారి గూడెం వాసి. ఎక్కడ భద్రాద్రి జిల్లా వ్యక్తి ఇక్కడ పోటీ చేయడం ఏంటని 2018 ఎన్నికల ప్రచారంలో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి పదేపదే విమర్శించే వారు. పైగా తుమ్మల నాగేశ్వరావు ప్రవర్తన తీరును కూడా కందాల ఉపేందర్ రెడ్డి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించారు. ఇది కూడా అతనికి లభించింది ఫలితంగానే తుమ్మల నాగేశ్వర మీద ఎనిమిదివేల కోట్ల పైచిలుకు మెజారిటీ లభించేలా చేసింది. అదే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరావు ను 2019 ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ దూరం పెట్టడం ప్రారంభించింది. ఒకానొక దశలో తుమ్మల నాగేశ్వరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి బీజేపీ లోకి వెళ్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే వీటన్నిటిని వారు ఖండించ లేదు. అలాగని సమర్దించడం లేదు. పైగా ఇటీవల కేటీఆర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో అల్పాహార విందు స్వీకరించారు. ఆ సమయంలోనే తుమ్మల నాగేశ్వరావు ని ప్రత్యేకంగా కలిసి పాలేరు మీకు మరలా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో తన విజయానికి ఎదురే లేదు అని ఉబ్బితబ్బిబ్బయ్యారు తుమ్మల నాగేశ్వరావు కు పాలెం నుంచి షర్మిల పోటీ లో ఉందని తెలియగానే ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇప్పటికే ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు లో పాతుకు పోయారు. ఆయనను కాదని తుమ్మల కు టికెట్ ఇస్తే కందాల ఉపేందర్ రెడ్డి వర్గీయులు ఏ మేరకు సహకరిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ విషయాలన్నీ తన ఆంతరంగికుల ద్వారా తెలుసుకున్న షర్మిల పాదయాత్రలో పోటీకి సై అంటున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే పాలేరు నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కుల సంఘాలతో సమావేశం నిర్వహించి అందులో కీలకంగా పనిచేస్తున్న వారిని మచ్చిక చేసుకుంటున్నారు. తెరపైకి ఇన్నీ సానుకూల అంశాలు కనిపిస్తున్నా.. మరోసారి తెలంగాణ వాదాన్ని తెరపైకి తెచ్చి లబ్ధి పొందాలని టీఆర్ఎస్ చూస్తోంది. కానీ దీనిని అధికార టీఆర్ఎస్ ఎంత వరకు ప్రజలకు తీసుకెలుతుందో అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Will sharmila win in paleru who are the rivals safe constituency
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com