AP 2024 Elections: ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పేదలకు సంక్షేమ పథకాలు కావాలి. సగటు మధ్యతరగతి కుటుంబాలకు ధరలు అదుపులో ఉండాలి. ఆపై రహదారులు విశాలంగా కనిపించాలి. ఒక్క నిమిషం కూడా పవర్ కట్ లేకుండా చూడాలి. ఇలా ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. కానీ అందరికీ సంతృప్తి పరిస్తేనే అధికారంలోకి రాగలమని తెలిసినా.. అందులో మెజారిటీ వర్గాల వైపే పాలకులు చూస్తున్నారు. రాష్ట్ర ఆదాయం, ఆపై తమ లాభాపేక్షను చూసుకునే అటువైపు మొగ్గు చూపుతున్నారు. అయితే దురదృష్ట వశాత్తు ఏపీ ప్రజలు సైతం సంక్షేమం, అభివృద్ధి అన్న వర్గాలుగా విడిపోయారు.
1999లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అప్పుడే విజన్ 20-20 అన్న స్లోగన్ ను అందుకున్నారు. అయితే ఆ సమయం వచ్చిందే కానీ..ఇప్పుడు ఆయన అధికారంలో లేకుండా పోయారు. కానీ నాడు చంద్రబాబు చెప్పిన 20-20 విజన్ అనేది ప్రజల్లో కనిపిస్తోంది. ఇప్పుడు అదే స్ఫూర్తితో 2047 విజన్ కు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అదే తనకు పదవి తెచ్చి పెడుతుందని నమ్మకంతో ఉన్నారు. ఒక్క సంక్షేమ పథకాలు లబ్ధిదారులు తప్పించి.. సమాజంలో మెజారిటీ సెక్షన్ తన వైపు వస్తుందని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు.
ఏపీ సీఎం జగన్ గత ఎన్నికల ముందు తన విజన్ ఏంటో ప్రకటించారు. నవరత్నాలు అమలు చేసి సంక్షేమ పాలన అందిస్తామని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే కొంతవరకు అమలు చేశారు. సంక్షేమానికి తానే బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకొస్తున్నారు. కానీ చంద్రబాబు మాదిరిగా విజన్ కనిపించలేదు. రహదారులు బాగాలేదు.. పరిశ్రమల జాడలేదు.. రియల్ బూమ్ పడిపోయింది. ఒక్క సంక్షేమం తప్పించి అన్ని ప్రతికూలతలే. పేదరికం లేని సమాజమే తన నవరత్నాల లక్ష్యమని జగన్ చెబుతూ వస్తున్నారు.
అయితే ఈ ఇద్దరి నేతల వ్యూహాత్మక వైఖరితో ప్రజలు డిఫెన్స్ లో పడుతున్నారు. ప్రజల ఆర్థిక స్థితిగతులు పెరగడం మంచిదే.. అదే సమయంలో అభివృద్ధి, మౌలిక వసతులు కీలకం. ఇద్దరి నేతల విజన్ లో ఏది అవసరమంటే.. రెండూ అవసరమనే చెప్పొచ్చు. కానీ ఎంపికే కష్టం. జగన్ తన సంక్షేమానికి అభివృద్ధిని జతపరచాలి.. చంద్రబాబు తన అభివృద్ధికి తోడు సంక్షేమాన్ని అమలు చేయాలి. ఈ రెండింటిలో ఏది మిస్ అయినా ఏపీ ప్రజలకు నష్టమే. అయితే ప్రతి ఐదేళ్లకు ఏపీ ప్రజలు ట్రెండ్ మారుస్తుంటారు. 2014లో బాబు విజన్ కు జై కొట్టారు. 2019లో మాత్రం జగన్ నవరత్నాలకు మొగ్గు చూపారు. 2024 ఎన్నికల్లో ఎటువైపు ఆసక్తి చూపుతారో చూడాలి మరి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: What will be the vision of ap people in 2024 elections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com