దేశమంతా కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులంతా రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేస్తున్నారు. అక్కడ కంట్రోల్ చేయలేక పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పక్కనున్న తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ ఈ కేంద్రం తెస్తున్న మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం రైతు రాజ్యాన్ని ఏపీలో నెలకొల్పుతానంటూ కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇవ్వడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కేసుల భయానికి బీజేపీకి మద్దతిచ్చారా అని విమర్శిస్తున్నాయి.
Also Read: ప్రధానితో భేటికి కేసీఆర్, జగన్.. ఏం జరుగుతోంది?
వ్యవసాయ సంబంధ బిల్లులను సంబంధిత మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఆదివారం ఉదయం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇదివరకే పార్లమెంట్లో ఆమోదం పొందిన ఈ బిల్లుతో ప్రయోజనమే కాని నష్టం లేదని నరేంద్రసింగ్ తెలిపారు. అలాగే రైతులు తమ ఉత్పత్తులను దళారులకు అమ్ముకోకుండా స్వేచ్ఛగా బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవచ్చని దీంతో తమకు కమీషన్ల బెడద లేకుండా అనుకున్న లాభాలు వస్తాయని పేర్కొన్నారు. విపక్షాలు ఈ బిల్లుపై అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులను విపక్షాలు మాత్రం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. పాలక, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. గందరగోళ పరిస్థితి నెలకొంది.
కానీ ఈ రైతు వ్యతిరేక బిల్లులకు రాజ్యసభలో వైసీపీ మద్దతు ప్రకటించడం సంచలనంగా మారింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీలు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని..కాంగ్రెస్ మధ్యదళారుల పార్టీ అని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ అభ్యంతరం తెలిపారు. విజయాసాయి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: ఏపీలో మత రాజకీయాలు దేనికి సంకేతం..?
దేశవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు.. వివిధ పార్టీలు వ్యతిరేకిస్తున్న ఈ బిల్లులకు వైసీపీ మద్దతు ప్రకటించడం ఆ పార్టీకి మైనస్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ రైతు రాష్ట్రమని ఇలాంటి విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన సీఎం జగన్ ఇలా భేషరతుగా మద్దతు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: What message is jagan giving to farmers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com