Chief Justice NV Ramana: దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. న్యాయమూర్తుల విషయంలో, జర్నలిస్టులపై, తాజా రాజకీయాలపై ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో శనివారం జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై పలు విషయాలపై ఆసక్తికరంగా మాట్లాడారు సీజేఐ.
తాను క్రియా శీలక రాజకీయాల్లోకి రావాలని అనుకున్నానని..కానీ అనుకోకుండా న్యాయవాద వృత్తి లోకి రావాల్సి వచ్చిందని తెలిపారు. అయితే కాలం తనకు సహకరించ లేదన్నారు. కష్టపడి చేసిన దాన్ని వదులు కోవాలనే నిర్ణయం అంత సులభం కాదన్నారను సీజేఐ. ఈ సందర్భంగా కేంద్రంపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు ఆయన.
Also Read: Minister KTR: బయట మంత్రిని.. ఇంట్లో తండ్రిని.. బర్త్డే వేళ కేటీఆర్ కామెంట్స్ వైరల్
– దేశంలో అత్యధికంగా కేసులు పరిష్కారం కాక పోవడానికి ఖాళీలను భర్తీ చేయక పోవడం, మౌలిక సదుపాయాలను కల్పించక పోవడమేనని పేర్కొన్నారు.
– న్యాయమూర్తుల జీవితాలపై జర్నలిస్టులు తప్పుడు కథనాలు రాయడాన్ని తీవ్రంగా ఖండించారు. విపరీత ధోరణితో కథనాలు రాయొద్దన్నారు. బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మీడియాలో డిబేట్ల పేరిట జరుగుతున్న ‘అతి’ ని తప్పుపట్టారు.
– మీడియా తమ టీవీ డిబెట్లతో కంగారు కోర్టులుగా(సరైన ఆధారాలు.. వాదప్రతివాదనలు లేని అనధికార న్యాయస్థానాలు) వ్యవహరిస్తున్నాయని, సోషల్ మీడియా కూడా అదే రీతిలో వ్యవహరిస్తూ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాయని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్ల ప్రవర్తన పక్షపాతం, అవగాహనలేమితో కూడిన సమాచారం, ప్రత్యేకించి ఒక ఎజెండా ఆధారితంగా ఉంటోంది ఆవేదన వ్యక్తం చేశారు.
– సోషల్ మీడియాలో జడ్జిలకు వ్యతిరేకంగా క్యాంపెయిన్లు చేస్తున్నారు. జడ్జిలు వాటికి అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం లేదు. దయచేసి దీనిని బలహీనతనో లేదంటే నిస్సహాయత అని పొరబడకండి అని న్యాయమూర్తులకు జస్టిస్ రమణ సూచించారు.
Also Read:Rupee Falling: రూపాయి విలువ పడిపోతే మనకేమవుతుంది..?
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Want to enter active politics sensational comments by cji nv ramana
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com