NTR – Prashanth Neel : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక నందమూరి తారక రామారావు గారి నుంచి ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగిన వారే కావడం విశేషం… ప్రస్తుతం ఈ ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా వాళ్ల సినిమాల కోసం యావత్ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అలాంటి స్టార్ హీరోల నుంచి రాబోయే సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ క్రియేట్ అవ్వడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంభందించిన విషయాలను ప్రశాంత్ నీల్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాని ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత నీల్ చేస్తున్న ఈ ప్రాజెక్టు భారీ విజయాన్ని సాధించాలని తద్వారా జూనియర్ ఎన్టీఆర్ కి భారీ గుర్తింపు రావాలని తన అభిమానులు ఆశిస్తున్నారు…
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఒకప్పుడు రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘మగధీర ‘ సినిమా కథని పోలి ఉంటుందని పునర్జన్మల నేపధ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ప్రశాంత్ నీల్ ఇలాంటి ఒక పాయింట్ ను తీసుకొని తన స్టైల్ మేకింగ్ ఎలాగైతే ఉంటుందో చూపించడానికి రెఢీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు ప్రశాంత్ నీల్ తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రభాస్ తో సలార్ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ఎన్టీఆర్ కు అంతకు మించిన సక్సెస్ ని అందిస్తారని తన అభిమానులకు మాట అయితే ఇచ్చాడు. మరి ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఇప్పుడు ఈ సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కించాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ పాన్ ఇండియాలో టాప్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నాడు.
కాబట్టి ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది. తద్వారా ఎన్టీఆర్ కి ఎలాంటి ఇమేజ్ ను కట్టబెట్టబోతున్నాడు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…