Viral Video : ఈ కథనం మాత్రం పూర్తి డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ తాగుతోంది ఆడవాళ్లు.. పైగా ఖర్చు పెడుతోంది మగవాళ్ళ సంపాదనను.. మగవాళ్లు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తుంటే ఆడవాళ్లు మాత్రం దర్జాగా పెగ్గులకు పెగ్గులు మందు తాగేస్తున్నారు. పార్టీలు చేసుకుంటూ జల్సాలు చేస్తున్నారు. ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు చేస్తున్నారు. మొదట్లో భార్యల వ్యవహార శైలి చూసిన భర్తలు మారతారని భావించారు. కానీ రోజులు గడుస్తున్నప్పటికీ భార్యల వ్యవహార శైలి మారడం లేదు. పైగా అంతకంత గురించి పోతున్నారు. దేవదాసిలు అయిపోతున్నారు. దీంతో గత్యంతరం లేక భర్తలు పోలీసులను ఆశ్రయించారు.. తన బాధను వారితో చెప్పుకున్నారు.
Also Read : విందు భోజనాలు అంటుంటాం కదా.. ఇలా పెట్టడంలో.. వీరి తర్వాతే ఎవరైనా.. వైరల్ వీడియో
ఎక్కడ జరిగింది అంటే
తమ భార్యలు విపరీతంగా తాగుతున్నారని.. తమ సంసారాన్ని నాశనం చేస్తున్నారని.. తాము సంపాదించిన సంపాదన మొత్తం వారి తాగుడుకే సరిపోతుందని ఒడిశా రాష్ట్రంలోని కోరాపూట్(డీ) పోలీస్ స్టేషన్లో కొండ గూడ గ్రామానికి చెందిన చెందిన భర్తలు ఫిర్యాదు చేశారు. “మా ఇంట్లో ఆడవాళ్లు విపరీతంగా తాగుతున్నారు. కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. తాగుడు మానుకోమని చెప్పినప్పటికీ వారు వినిపించుకోవడం లేదు. ముఖ్యంగా విపరీతంగా సారా తాగుతున్నారు. సారా తయారీని నిలిపివేయండి. సారా తాగి వారు ఏ పనికీ వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉంటున్నారు. సమయానికి డబ్బులు లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులను తాకట్టు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో సారా తయారు కేంద్రాల్లోనే పడిపోతున్నారు. అక్కడి నుంచి వారిని తీసుకురావడం చాలా ఇబ్బందికరంగా మారింది. ఇలా కొన్ని రోజులుగా జరుగుతోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. ప్రభుత్వం నల్ల బెల్లంపై నిషేధం విధించామని చెబుతోంది. కానీ వాస్తవంలో అది జరగడం లేదు. నల్ల బెల్లం విస్తృతంగా వస్తుండడంతో తయారీదారులు సారాను విపరీతంగా కాస్తున్నారు. అందులో ప్రమాదకరమైన పదార్థాలు కలిపి మత్తు ఎక్కువగా ఉండేలా చేస్తున్నారు. ఆ మత్తుకు బానిసలైన మా భార్యలు ఇంకా ఎక్కువ తాగుతున్నారు. ఇలా తాగి తాగి వారి ఆరోగ్యాలను పాడు చేసుకుంటారని భయమేస్తోంది. మాకు పిల్లలు ఉన్నారు. వారి భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని సారా తయారు కేంద్రాలపై దాడులు నిర్వహించాలని” పోలీసులకు చేసిన ఫిర్యాదులు ఆ భర్తలు పేర్కొన్నారు. సాధారణంగా భర్తలు తాగుతుంటే భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరగడంతో ఒక్కసారిగా ఈ ఘటన సంచలనంగా మారింది. ఇది కాస్త అక్కడి ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరడంతో.. సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించాలని పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది.
Also Read : బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ పక్కన పెట్టి చేపలు తింటున్నారా.. వామ్మో ఇది మామూలు మోసం కాదు.. వైరల్ వీడియో
View this post on Instagram