Viral Video : పండుగలు,పెళ్లిళ్లు, ఇతర వేడుకలు ఏవైనా కానీ, మహిళలు తమ చేతులకు తప్పకుండా గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు చేతులకు పండిన తర్వాత చాలా అందంగా కనిపిస్తుంది. దీనిలో వివిధ రకాలు ఉంటాయి. ప్రతి ఒక్కదానికీ దాని స్వంత ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ఒక గోరింటాకు వీడియో ప్రస్తుతం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక అమ్మాయి రాళ్ల నుంచి గోరింటాకును ఎలా తీసి పెట్టుకోవచ్చో తెలిపింది. గోరింటాకు పెట్టుకునే ఈ ప్రత్యేకమైన విధానం ప్రస్తుతం చాలా స్పీడుగా వైరల్ అవుతుంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో హిమాచల్‌కు చెందిన ఒక మహిళా ఇన్ఫ్లుయెన్సర్ ప్రజలకు రాయి నుంచి గోరింటాకు తయారుచేసే విధానాన్ని వివరిస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మందికి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. అయితే ఈ విధానం తెలియని వారు కూడా చాలా మంది ఉన్నారు. దీనిని చూసిన తర్వాత నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వీడియోలో కనిపిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ పేరు రూబీ ఠాకూర్..ఆమె కొండ ప్రాంతపు సంప్రదాయాన్ని ప్రజలకు చూపిస్తోంది.
వీడియోలో రూబీ రాళ్ల నుండి గోరింటాకును ఎలా తీయాలో చూపిస్తుంది. దీని కోసం ఆమె ఒక ప్రత్యేకమైన రాయి దగ్గరకు వెళ్తుంది. అక్కడ గోరింటాకు పెరుగుతుంది. దానిని ఆమె రాయిపై రుబ్బి తన చేతులకు పెట్టుకుంటుంది. దీని కోసం ఆమె ఒక చిన్న కర్రను ఉపయోగిస్తుంది. దానితో తన చేతులకు చాలా అందమైన డిజైన్‌ను వేసుకుంటుంది. ఆ తర్వాత ఆమె తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటుంది. తను, తన అక్కచెల్లెళ్లు కలిసి గోరింటాకు పెట్టుకున్న రోజులను గుర్తు చేసుకుంటుంది. ఈ క్లిప్‌ను 7 మిలియన్ల కంటే ఎక్కువ సార్లు వీక్షించారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోను రూబీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనిని చూసిన తర్వాత ప్రజలు దీనిపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఒక యూజర్ “గోరింటాకు పెట్టుకునే ఈ విధానం చాలా ఆసక్తికరంగా ఉంది” అని రాశాడు. మరొకరు “గోరింటాకు పెట్టుకునే ఈ విధానం నేచురల్ భాయ్” అని రాశాడు. దీనితో పాటు చాలా మంది యూజర్లు దీనిపై కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Also Read : నిండు గర్భంతో జోష్‌ఫుల్ డ్యాన్స్.. సునిధి చౌహాన్ స్ఫూర్తిదాయక కథ..!