Viral Video : ప్రపంచంలో కొందరు తమ కావాల్సిన పనులు ఎలగోలా నెట్టుకొస్తూ కానిస్తుంటారు. ఇంకొందరు మాత్రం చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఇలాంటి పనులు చూస్తే ఎవరైనా సరే వీళ్లది ఇదేం పిచ్చి పని అని అనక మానరు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలానే చూస్తుంటాం. తాజాగా అలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన వాళ్లంతా నోరెళ్లబెడుతున్నారు.
మన దగ్గర కొందరు పద్ధతిగా తమ పనులు చేసుకుంటారు. మరికొందరు మాత్రం తొందరగా పని అయిపోతే చాలు అనుకుంటారు. దానికోసం ఏదైనా చేస్తారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను చూడండి. ఒక వ్యక్తి స్కూటర్‌పై సరదాగా వెళ్తున్నాడు. కానీ వెనుక అతని స్నేహితుడు మాత్రం నిలబడటానికి కూడా సరిగ్గా చోటు లేకపోయినా వేలాడుతూ కనిపిస్తున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే.. స్కూటర్‌పై వెనుక నిలబడటానికి కొంచెం ప్లేస్ మాత్రమే ఉంది.. కానీ రైడర్ మాత్రం దానిని కూల్ గా నడుపుకుంటూ పోతున్నాడు.
https://x.com/rareindianclips/status/1917845147221635477?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1917845147221635477%7Ctwgr%5E4154020fc97b2cb68611402e252cc149a6c3965f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fman-drive-scooty-in-unique-way-people-will-shocked-after-seeing-this-3265255.html
వీడియోలో ఒక వ్యక్తి స్కూటర్‌ను నడుపుతున్నట్లు కనిపిస్తుంది. వెనుక రెండు పెద్ద గడ్డి మోపులు ఉన్నాయి. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ గడ్డి మోపులు పెట్టిన తర్వాత స్కూటర్‌పై కూర్చోవడానికి కూడా ఖాళీ లేదు. కానీ అతని స్నేహితుడు మాత్రం ఒక చేయితో అతడిని పట్టుకుని, ఇంకో చేయితో స్కూటర్‌ను బ్యాలెన్స్ చేస్తూ నిలబడి ఉన్నాడు. ఒక్క క్షణం బ్యాలెన్స్ తప్పినా ఇద్దరూ కింద పడిపోయే ప్రమాదం ఉంది.ప్రాణాలు ప్రమాదంలో పడిపోయేవి.
ఈ వీడియోను ఎక్స్‌లో @rareindianclips అనే అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఈ వార్త రాసే సమయానికి వేల మంది దీనిని చూసి కామెంట్లు పెడుతున్నారు. ఒక యూజర్ “ఏమైనా చెప్పండి, బ్యాలెన్స్ మాత్రం సూపర్!” అని కామెంట్ చేస్తే, ఇంకొక యూజర్ “ఇలా ఎవరైనా సామాన్లు తీసుకెళ్తారా?” అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంకా చాలా మంది ఈ వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.