Viral Video : మనిషిలో ఏదైనా సాధించాలనే తపన ఉండాలే కానీ ప్రపంచంలో ఏ కష్టం కూడా అతని విజయానికి అడ్డుగా నిలబడలేదని అంటారు. ఇలాంటి అనేక ఉదాహరణలు మనం చూసే ఉంటాం. అలాంటి వారి విజయగాథలు బయటకు వచ్చినప్పుడు ఊహించని విధంగా వారు సాధించిన విజయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. తాజాగా అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక బాలుడు తన తెలివితేటలతో క్రికెట్ బ్యాట్‌ను తయారుచేసిన విధానం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోలో ఏముందో వివరంగా చూద్దాం.
మీకు మీ మొదటి క్రికెట్ బ్యాట్ ఎప్పుడు వచ్చిందో గుర్తుందా? ఖచ్చితంగా చిన్నతనంలోనే వచ్చి ఉంటుంది. కానీ మన భారతదేశంలో చాలా మంది తమ పిల్లలకు క్రికెట్ బ్యాట్ కొనివ్వలేని పరిస్థితుల్లో ఉంటారు. అంటే ఆ పిల్లలు క్రికెట్ ఆడరని కాదు. వారు ఏదో ఒక ఉపాయంతో తమ కోసం బ్యాట్‌ను ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక బాలుడు అద్భుతమైన రీతిలో క్రికెట్ బ్యాట్‌ను తయారుచేశాడు.
వీడియోలో కనిపిస్తున్న బాలుడు మూడు మందపాటి కర్రల సహాయంతో తన కోసం బ్యాట్‌ను తయారుచేసుకున్నాడు. వాటిని కలపడానికి అద్భుతమైన ఆలోచన చేశాడు. కోల్డ్ డ్రింక్ బాటిల్‌ను ఒక ప్రత్యేకమైన రీతిలో అమర్చాడు. అది చూస్తే భలేగా ఉంది బ్యాట్. ఈ వీడియో చూస్తే టాలెంట్, అవసరం, లోకల్ ఇన్నోవేషన్ కలిస్తే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని అర్థమవుతుంది. అందుకే ఈ వీడియో ప్రజల్లో ఫాస్టుగా వైరల్ అవుతోంది.
ఈ క్లిప్‌ను brar1_35 అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. దీనిని 75 లక్షల మందికి పైగా వీక్షించారు.. కొన్ని లక్షల్లో కామెంట్స్ వస్తున్నాయి. వాటి ద్వారా నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఒక యూజర్ వీడియోపై కామెంట్ చేస్తూ.. “నిజంగా ఇది చూస్తే పేదరికం ఓడిపోయింది.. ఈ పిల్లవాడి టాలెంట్ గెలిచింది అనిపిస్తుంది” అని రాశాడు. మరొకరు, “నిజంగా ఈ బ్యాట్‌తో మాయా షాట్లు వస్తాయి. ఎవరూ అవుట్ చేయలేరు” అని రాశాడు.
Also Read : నిండు గర్భంతో జోష్‌ఫుల్ డ్యాన్స్.. సునిధి చౌహాన్ స్ఫూర్తిదాయక కథ..!