Viral Video : పక్షుల్లో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ.. జీవన విధానం దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే కొన్ని పక్షులు దృఢమైన చెట్లను సైతం తమ ఆవాసంగా మార్చుకుంటాయి. ముక్కుతో రంద్రాలు చేసి అందులో నివాసం ఉంటాయి. పక్షుల్లో కొన్ని మాత్రం అత్యంత తెలివితో ఉంటాయి. అవి వాటి అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో అవి కమలహాసన్ ను మించి నటిస్తుంటాయి. మనం గనక గుర్తించకపోతే మోసపోయినట్టే. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఆ వీడియోలో ఏముందంటే..
పక్షులు తమ దైనందిన జీవితాన్ని ప్రారంభించే సమయంలో ఏదైనా అవాంతరం చోటు చేసుకున్నప్పుడు వెంటనే సురక్షితమైన ఆవాసానికి వెళ్తుంటాయి. ముందుగా అక్కడ ఒక నీడ ప్రాంతంలో తిష్ట వేసుకుంటాయి. ఆ తర్వాత మనుషుల అలికిడి వినిపిస్తే.. వెంటనే తమకు రక్షణ కల్పించాలని ఏదో విధంగా తాపత్రయ పడుతుంటాయి. ఆ తర్వాత రక్షణ లభించిన అనంతరం.. ఆహారం కోసం సంకేతాలు ఇస్తుంటాయి. అలా ఆహారం తిన్న తర్వాత మళ్లీ తమ దారి తమ చూసుకుంటాయి. ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం తెగ సందడి చేస్తోంది.
చూడ్డానికి అందంగా ఉన్న ఓ పక్షి గాయపడింది. ఆహారం కూడా సేకరించుకోలేని దుస్థితికి చేరుకుంది. దానిని గమనించిన తోటి పక్షులు తమ వంతుగా సహాయం చేయడానికి వచ్చాయి. అయితే అప్పటికే ఆ గాయపడిన పక్షి ఓ ఇంటి వద్దకు చేరుకుంది. దీంతో ఆ ఇంటి యజమాని ఆ పక్షికి ఆహారం అందించడానికి లోపలికి వెళ్ళాడు. దానికోసం కొన్ని గింజలు తీసుకొచ్చాడు. ఈలోగా మరికొన్ని పక్షులు అక్కడికి వచ్చాయి. ఆ గాయపడిన పక్షి మాదిరిగానే అవి కూడా నటించడం మొదలుపెట్టాయి. స్పృహ కోల్పోయినట్టు యాక్టింగ్ చేశాయి. అది చూసిన ఆ ఇంటి యజమాని బాధపడ్డాడు. ఇంట్లోకి వెళ్లి మరిన్ని గింజలు తీసుకొచ్చాడు. ఆ గింజలను వాటికి ఆహారంగా వేశాడు. ఆ గింజలను ఇష్టంగా తిన్న పక్షులు.. ఆ తర్వాత అక్కడి నుంచి తుర్రుమంటూ పరుగులు పెట్టాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది..” సాధారణంగా మనుషులు మాత్రమే నటిస్తారు అనుకుంటాం. కానీ పక్షులు అంతకుమించి అనే రేంజ్ లో నటిస్తుంటాయి. వాటి నటన ముందు కమల్ హాసన్ కూడా పనికిరాడు. ఈ పక్షులు నటించిన తీరు చూస్తే మామూలుగా లేదు. బాబోయ్ ఆహారం కోసం అవి ఎంతలా యాక్టింగ్ చేశాయో చూస్తుంటేనే ఆశ్చర్యం కలుగుతుందని” నెటిజన్లు అంటున్నారు. ఆహారం తిన్న తర్వాత ఆ పక్షులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఇక దీనికి సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. అది కాస్త విశ్వవ్యాప్తమైంది.
View this post on Instagram