Instagram Reel Video: నేటితరం మీద సినిమాల ప్రభావం విపరీతంగా ఉంటున్నది. సినిమా హీరోలను, విలన్లను అనుకరిస్తూ యువతరం రకరకాల చేష్టలకు పాల్పడుతున్నారు. ఇందులో ఉన్మాద చర్యలే అధికంగా ఉంటున్నాయి. పైగా తమ ఉన్మాదాన్ని యువత దాచుకోవడం లేదు. దానిని వీడియో తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. లేదా దారుణాలకు పాల్పడే కంటే ముందు రీల్స్ చేస్తూ తమ శాడిజాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో పరువు హత్యకు గురైన రుచిత విషయంలోనూ ఆమె సోదరుడు పై విధానాన్నే అనుసరించాడు.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో ఇటీవల 21 సంవత్సరాల రుచిత అనే అమ్మాయి హత్యకు గురైంది. ఈ హత్యను ఆమె సోదరుడు రోహిత్ చేశాడు. రోహిత్ వయసు 20 సంవత్సరాలు. వద్దని చెప్పినప్పటికీ రుచిత తన ప్రేమికుడితో మాట్లాడుతోందని అక్కసు పెంచుకున్న రోహిత్.. ఆమెను హత్య చేశాడు. రుచిత గొంతుకు వైరు బిగించి.. ఊపిరి ఆడకుండా చేసి.. చంపేశాడు.
Also Read: రిసార్ట్ స్టాఫ్ తో యంగ్ హీరోయిన్ రౌడీయిజం..సంచలనం రేపుతున్న వీడియో!
ఈ కేసులో విచారణ సాగిస్తున్న పోలీసులకు దిమ్మ తిరిగిపోయే నిజం తెలిసింది. రోహిత్ ఫోన్ లో.. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర చెప్పిన ” బాగా బతికి పేరు తెచ్చుకొని ఫేమస్ అయ్యే ఓపిక లేదు.. చంపి ఫేమస్ అయ్యేదా” డైలాగ్ కు రోహిత్ రీల్ చేశాడు. అంటే ఆమెపై ఎప్పటినుంచో కోపం పెంచుకున్న రోహిత్.. ఆమెను పథకం ప్రకారమే హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
రుచితకు అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి ఎప్పటినుంచో ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. అతడితో మాట్లాడొద్దని చెప్పారు. అయినప్పటికీ రుచిత ఆగలేదు. ఈ వ్యవహారం పెద్ద మనుషులు దాకా వెళ్ళింది.. ఆ పంచాయతీలో ఇద్దరు మాట్లాడుకోకూడదని పెద్ద మనుషులు తీర్పు చెప్పారు. దానికి కట్టుబడి ఉంటామని రుచిత, ఆమె ప్రియుడు అంగీకరించారు. ఆ మాటకు కట్టుబడి ఉండకుండా ఇద్దరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చాటుమాటుగా కలుసుకోవడం కూడా మొదలుపెట్టారు. ఇది రోహిత్ దృష్టికి వచ్చింది. ఇటీవల తల్లిదండ్రులు పనిమీద బయటికి వెళ్లడంతో రుచిత తన ప్రేమికుడితో మాట్లాడుతోంది. ఈ విషయంలో రోహిత్ ఆమెతో గొడవపడ్డాడు. విచక్షణ కోల్పోయి ఆమె మెడకు వైరుచుట్టి.. గాలి ఆడకుండా చేసే దారుణంగా చంపేశాడు. పోలీసులకు విచారణలో రోహిత్ తను చేసిన నేరాన్ని అంగీకరించాడు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులకు అతడు చేసిన రీల్ వెలుగులోకి రావడం విశేషం.
బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు..బాగా చంపి ఫేమస్ అయ్యేదా
వేరే యువకుడితో ఫోన్ మాట్లాడుతుందని అక్కని చంపిన తమ్ముడి కేసులో బయటపడ్డ కీలక విషయాలు
అక్కను చంపే ముందు ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసిన తమ్ముడు
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో తన అక్క రుచిత(21),… https://t.co/qX8lHqvTzv pic.twitter.com/J4hfjl9vJJ
— Telugu Scribe (@TeluguScribe) July 30, 2025