viral video : ప్రస్తుత సాంకేతిక కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్న సంచలనాలు మామూలువి కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసాధ్యాలు సైతం సుసాధ్యాలవుతున్నాయి. అన్ని రంగాలలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించడంతో మనుషుల అవసరం తగ్గిపోతుంది. ఆవిష్కరణ సంఖ్య పెరిగిపోతుంది. అద్భుతాలు కళ్ళ ముందు ఆవిష్కారమవుతున్నాయి. ఫలితంగా ఈ సాంకేతికత మనషుల జీవితంలో సరికొత్త మార్పులకు కారణమవుతోంది. దీనిపై రకరకాల విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ.. సాంకేతిక నిపుణులు మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సరికొత్త ఆవిష్కరణలను తెరపైకి తీసుకువస్తున్నారు. అయితే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఇటీవల కొత్తగూడెంలో చనిపోయిన వ్యక్తిని సృష్టించారు. అతడు వారింట్లో శుభకార్యానికి హాజరైనట్టు వీడియో రూపొందించారు. అది అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు మరో వీడియో కూడా అదే స్థాయిలో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం.. ఓ ఫంక్షన్ హాల్ లో పెళ్లి జరుగుతున్నది. పెళ్లి క్రతువు మొత్తం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులు ఒకచోట కూర్చున్నారు. ఇంతలోనే వారి కుటుంబంలో ఇటీవల చనిపోయిన పెద్ద కుమారుడు స్వర్గం నుంచి దిగివచ్చినట్టు కనిపించాడు. ఆ పెళ్లిలో సందడి చేశాడు. తన సోదరుడు తాళి కడుతున్న శుభ సందర్భాన్ని ఆస్వాదించాడు. అక్షింతలు వేశాడు. కుటుంబ సభ్యులతో కలిసి విందు ఆరగించాడు. వారితో కలిసి గ్రూప్ ఫోటో దిగాడు. అనంతరం అందరికీ టాటా చెబుతూ స్వర్గంలోకి వెళ్లిపోయాడు. అయితే ఆ కుటుంబంలో పెద్ద కుమారుడు ఇటీవల ఓ ప్రమాదంలో చనిపోయాడు. దీంతో అతని జ్ఞాపకాలను కుటుంబ సభ్యులు మరింత పదిలపరచుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఆ వీడియోను రూపొందించారు. అందులో ఉన్నది అభూత కల్పనే అయినప్పటికీ.. తమ కుమారుడు పెళ్లిలో సందడి చేయడాన్ని ఆ తల్లిదండ్రులు కనులారా వీక్షించారు. అతడు తమతో నట్టే భావించారు. ఆ వీడియో చూస్తున్నంత సేపు కన్నీటి పర్యంతమయ్యారు. భావోద్వేగానికి గురయ్యారు. వీడియో పూర్తయిన తర్వాత మరణించిన వ్యక్తి తల్లి కన్నీటిని ఆపుకోలేక..బోరును ఏడ్చేసింది. ఇక దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది. ” ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను చాలామంది తిట్టుకుంటున్నారు. కానీ ఇలాంటి జ్ఞాపకాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందిస్తోంది. చనిపోయిన వ్యక్తులను కూడా తిరిగి పుట్టిస్తోంది. వారు మనతో ఉన్నట్టు.. మనతో మాట్లాడినట్టు.. మనతో కలిసి భోజనం చేసిన అనుభూతిని కల్పిస్తోంది. ఇలాంటి విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపకర్తలకు సలాం చేయాల్సిందేనని” నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. తమ కుటుంబంలో చనిపోయిన ఓ వ్యక్తిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్వర్గం నుంచి నడిచి వచ్చినట్టు ఓ వీడియో రూపొందించారు. ఆ వీడియోను చూసిన కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.#artificialintelligence pic.twitter.com/g9djDZMbBL
— Anabothula Bhaskar (@AnabothulaB) February 25, 2025