Viral Cinema: సినిమా వైరల్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఒకప్పుడు సినిమాలతో ప్రేక్షకులను అలరించి.. మూవీలకు గుడ్ బై చెప్పిన సినీతారలు.. ఇప్పుడు సోషల్ మీడియాతో అభిమానులకు దగ్గరవుతున్నారు. స్వయంవరం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లయ.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమై.. అమెరికాలో సెటిల్ అయ్యింది. తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కచ్చా బాదం సాంగ్‌కి.. తన ఫ్రెండ్‌తో కలిసి స్టెప్పులేసింది. చీరకట్టులో లయ వేసిన స్టెప్పులకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
మరో అప్ డేట్ విషయానికి వస్తే.. యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘కార్తికేయ 2, ’18 పేజెస్’ చిత్రాలతోపాటు మరో స్పై చిత్రంలో నిఖిల్ నటిస్తున్నాడు. ఐడీ ఎంటర్టైన్మెంట్స్, రెడ్ సినిమాస్ పతాకాలపై రాజశేఖర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం లైవ్ వెపన్స్‌తో ట్రైనింగ్ మొదలుపెట్టినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు నిఖిల్. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.
ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భీమ్లానాయక్ ట్రైలర్‌పై మరో అప్డేట్ వచ్చింది. ఇవాళ రాత్రి 8.10 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. ‘పవర్ తుపానుకు రెడీగా ఉండండి’ అని ఓ ఫొటోను ట్వీట్ చేసింది. పవన్, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల కానుంది.
మరో అప్ డేట్ ఏమిటంటే.. తెలుగుతోపాటు తమిళ్లోనూ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ చాలా పాపులర్ అయింది. అక్కడ ఇప్పటివరకు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. బిగ్‌బాస్ అల్టిమేట్ షోను కూడా ఆయనే హోస్ట్ చేస్తున్నారు. అయితే వచ్చే ఎపిసోడ్ల నుంచి తాను అందుబాటులో ఉండనని, హోస్ట్‌గా వైదొలుగుతున్నట్లు కమల్ ప్రకటించారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘విక్రమ్’ సినిమా కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఆయన స్థానంలో ఎవరు వస్తారో చూడాలి.
Also Read: వైభవంగా కాజల్ సీమంతం.. ఫొటోలు చూశారా ఎంత అందంగా ఉన్నాయో..!
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More