spot_img
Homeట్రెండింగ్ న్యూస్Viral Video : ప్రాణాలు పోతున్నాయి.. సోదరి పెళ్లిలో డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువతి.....

Viral Video : ప్రాణాలు పోతున్నాయి.. సోదరి పెళ్లిలో డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువతి.. వైరల్ వీడియో

Viral Video : ప్రపంచ వ్యాప్తంగా వైద్యరంగం గణనీయమైన అభివృద్ధి, పురోగతి సాధిస్తోంది. వైద్య విధానంలో, వ్యాధుల గుర్తింపు, చికిత్స, నివారణ అంశాల్లోనూ కీలకంగా మార్పులు వస్తున్నాయి. అయితే వైద్యరంగంలో సాంకేతికత(Technology)ఎంత అభివృద్ది చెందినా ఆకస్మిక మరణాలను(Sudden death)మాత్రం ఆపలేకపోతున్నాం. కొంత వరకు నివారణ చర్యలు చేపట్టినా.. మరణం ఎప్పుడు.. ఎవరికీ, ఏ రూపంలో వస్తుందో తెలియదు. మృత్యువు వచ్చినప్పుడు మాత్రం అందరూ తల వంచాల్సిందే. కోవిడ్‌(Covid)తర్వాత సడెన్‌ డెత్‌లు పెరిగాయి. కరోనా వ్యాక్సిన్ల కారణంగా రక్తం చిక్కబడి గుండె పోట్లు వస్తున్నాయి. అప్పటి వరకు ఆనందంగా ఉన్నవారు ఒక్కసారిగా కుప్ప కూలుతున్నారు. ఇలాంటి గతంలో గతంలో అనేకం జరిగాయి. తాజాగా భోపాల్‌(bhopal)ఓ యువతి పెల్లి వేడుకల్లో డ్యాన్స్‌ చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలింది. అక్కడికక్కడే మృతిచెందింది. తన సోదరి వివాహం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. సడెన్‌గా కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. దీంతో అప్పటి వరకు సంబురంగా వేడుకలు జరగగా.. వధువు సోదరే కూప్పకూలిపోవడంతో విషాధం నెలకొంది.

డ్యాన్స్‌ చేస్తూ…
సోదరి వివాహం నేపథ్యంలో యువతి అప్పటి వరకు ఆకట్టుకునే డ్యాన్స్‌ చేసింది. క్షణం పాటు డ్యాన్స్‌ ఆపేసింది. తర్వాత ఒక్కసారిగా పడిపోయింది. కోవిడ్‌ తర్వాత ఇలాంటి మరణాల సంఖ్య పెరుగుతున్నాయి. ఇక భోపాల్‌లో యువతి కుప్పకూలిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డు అయ్యాయి.వీడియో చూసిన నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

కారణాలు తెలియదు..
పెళ్లిళ్ల వేడుకలు అనేది చాలా హాయిగా, ఉల్లాసంగా ఉండే కార్యక్రమాలు. ఈ వేళల్లో ప్రజలు ఎక్కువగా డ్యాన్స్‌ చేస్తారు. కొంతమంది డ్యాన్స్‌ చేసే సమయంలో మద్యం ప్రభావంతో లేదా నర్తనానికి సంబంధించిన ఉత్సాహంలో ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ముఖ్యంగా మైదానంలో పెద్ద సంఖ్యలో జనం, బాజా, డీజే పాటలతో ఉల్లాసంగా డ్యాన్స్‌ చేస్తారు. ఈ సన్నివేశంలో చాలా సరదా ఉంటే, కొంతమంది నాట్యం చేసినప్పుడు అడుగు జారి కుప్పకూలిపోతుంటారు. మరికొంతమంది మద్యం తాగి సడెన్‌ గా ఎవరూ ఊహించని విధంగా కుప్పకూలిపోవచ్చు. కొన్ని సందర్భాలలో, వారి కుప్పకూలిన ప్రతిస్పందన వినోదంగా ఉండవచ్చు, కానీ కొన్నిసార్లు అది ప్రమాదకరంగా కూడా మారవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES
spot_img

Most Popular