Viral Video : సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి చాలా మంది చాలా కష్టపడుతున్నారు. వ్యూస్ పొందడానికి ఏదైనా చేయడానికి వెనుకాడడం లేదు. దీని కోసం కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. చాలా సార్లు, ప్రజలు తమ ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో రోజుకు వందల సంఖ్యలో వింత వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే మనలన్నీ ఆకట్టుకుంటాయి. ప్రజలు వాటిని కొన్నాళ్ల పాటు గుర్తు పెట్టుకోగలుగుతారు. మనమంతా మామూలు మనుషులమే. కానీ మనలో ఏదో ఒక టాలెంట్ ఎక్కడో ఓ మూలన దాగి ఉంటుంది. దాన్ని మనమే కనిపెట్టుకుని.. పదును పెట్టుకుని స్టార్‌డమ్ సంపాదించుకోవాలి. అలా తనలోని టాలెంట్ ను ఓ యువతి గుర్తించుకుంది. ఆమె ఓ వీడియో ద్వారా ఇప్పుడు వైరల్ అయింది. తన టాలెంట్‌తో ఆమె సెలబ్రిటీగా ఎదిగింది. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా వేటికీ బెదరకుండా తను ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తుంది.
ఆ అమ్మాయి పేరే సాయిబా. తను సామాన్యంగా వృత్తి రీత్యా పాములు పడుతుంది. అది కాకుండా తన మరో వృత్తికింద మోడలింగ్ ఎంచుకుంది. ఆమె సూపర్ మోడల్ గా ఎదిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లూయెన్సర్ కూడా. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్ లో 2 అకౌంట్లు ఉన్నాయి. ఒక దాంట్లో 19 లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా.. మరో దాంట్లో రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది.
ఈ వీడియోలో సాయిబా.. చీరలో కనిపించింది. ఓ ఇంటి దగ్గర చెక్కల మధ్యలో దాక్కున్న విషపూరిత నాగు పామును తను ధైర్యంగా చేతితో పట్టేసుకుంది. అది దాదాపు ఏడు అడుగుల పొడవు ఉంది. దాన్ని అలా పట్టి.. ఇలా ప్లాస్టిక్ బాటిల్‌లో బంధించింది. ఆ తర్వాత ఊరి శివార్లలోని పొలాల్లో వదిలేసింది. ఈ వీడియో దాదాపు 10 లక్షల లైక్స్, 2.6 కోట్ల వ్యూస్ సాధించింది. ఇలా సాయిబా.. ఒకటి కాదు.. చాలా పాములను పట్టుకుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పట్టుకున్న పాముల వీడియోలను అప్ లోడ్ చేస్తుంది.
ఇవేకాదు సాయిబాలో మారో టాలెంట్ కూడా దాగి ఉంది. సాయిబా మంచి డాన్సర్, ఆర్టిస్ట్ కూడా. అమ్మాయిలు తలచుకుంటే, చెయలేనిది ఏదీ లేదని ఆమె నిరూపిస్తోంది. లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప-2 సినిమాలో కిస్సిక్ సాంగ్‌కి ఆమె రీల్ చేసింది. ఇవే కాదు ఆమె ఫన్నీ వీడియోలు కూడా చేసింది. తను ఉండే ఏరియాలోనే రీల్స్ చేసే వీలున్న అంశాలను తీసుకుని వాటిపైనే చేసేస్తుంది. ఇలా సాయిబా ఓ వైపు పాములను పట్టుకుంటూనే.. మరోవైపు తన టాలెంట్‌తో రీల్స్ చేస్తూ.. ఫాలోయర్స్ సంఖ్యను పెంచుకుంటుంది.