https://oktelugu.com/

Breaking news : మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ను పట్టించిన అల్లు అర్జున్..మహారాష్ట్ర లో సంచలన ఘటన!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన 'పుష్ప 2 ' చిత్రం దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలను నమోదు చేస్తూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం.

Written By:
  • Vicky
  • , Updated On : December 23, 2024 / 01:01 PM IST

    Allu Arjun

    Follow us on

    Breaking news : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలను నమోదు చేస్తూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. సినిమా విడుదలై 18 రోజులు దాటినప్పటికీ కూడా, ఇప్పటికీ ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను నమోదు చేసుకుంటుంది. ముఖ్యంగా నార్త్ ఇండియా లో ఇప్పటికే ఈ చిత్రం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. హిందీ వెర్షన్ లో 650 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, అతి త్వరలోనే 700 కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరనుంది. నిన్న కూడా ఈ చిత్రానికి హిందీ లో 24 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతున్న ‘పుష్ప 2 ‘ ఖాతాలో మరో అరుదైన రికార్డు నెలకొంది.

    పోలీసులు 10 నెలలుగా వెతుకుతున్న ఒక పేరు మోసిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ ని పట్టించింది ఈ చిత్రం. పూర్తి వివరాల్లోకి వెళ్తే విశాల్ మేశ్రాం అనే గ్యాంగ్ స్టార్ పై రెండు హత్య కేసులు, డ్రగ్స్ అక్రమ రవాణా, హింసాత్మక ఘటనలతో పాటు మరో 27 అత్యంత కీలకమైన కేసులు ఉన్నాయి. పోలీసులు ఇతని కోసం పది నెలలుగా వేటకని చోటు అంటూ లేదు. అయితే విశాల్ కి పుష్ప 2 సినిమాని చూడాలనే కోరిక పుట్టింది. ఈ మేరకు ఆయన మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో ఉన్నటువంటి ఒక ప్రముఖ మల్టీ ప్లెక్స్ థియేటర్ లో ఈ చిత్రాన్ని చూసేందుకు వచ్చాడు. ఇతను ఈ థియేటర్ కి వస్తున్నాడు అనే సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న పోలీసులు, అతని పై పూర్తి స్థాయి నిఘా పెట్టింది. సినిమా చూసి బయటకి వచ్చి పార్కింగ్ లో కారులో బయలుదేరేందుకు సిద్ధం అవుతుండగా ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు.

    ఎంతో రహస్యంగా పోలీసులకు చిక్కకుండా గడుపుతున్న ఈ గ్యాంగ్ స్టర్ ని కూడా థియేటర్ కి రప్పించేలా చేసిందంటే, నార్త్ ఇండియన్స్ కి పుష్ప 2 ఏ రేంజ్ లో ఎక్కిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన తెలుసుకున్న నెటిజెన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, గ్యాంగ్ స్టర్ ని పట్టించిన అల్లు అర్జున్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పుష్ప 2 వసూళ్ల విషయానికి వస్తే ఇప్పటి వరకు 1600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఈ వారం తో రెండు వేల కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ విడుదల కూడా 58 రోజుల తర్వాతే ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో ఈ చిత్రం థియేట్రికల్ రన్ సంక్రాంతి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.