Puri Musings: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తన కంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాధ్…ఒకప్పుడు ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు యావత్ సినిమా ప్రేక్షకులందరు అటెన్షన్ తో ఎదురుచూసేవారు…అయితే ఇప్పుడు ఆయన హవ కొంచెం తగ్గింది…కానీ ఆయన పడిన కెరటంలా ప్రతిసారి లేస్తూనే ఉన్నాడు. ఎంత డౌన్ అయితే అంతా పైకి ఎదగడం పూరి జగన్నాధ్ కి తెలిసినంత గొప్పగా మరేవరికి తెలియదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ప్రస్తుతం ఆయన వరుసగా డిజాస్టర్ సినిమాలను తీస్తున్నప్పటికి ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించే విధంగా వాళ్లలో మోటివేషన్ నింపుతూ పొడ్ కాస్ట్ రూపంలో ఏదో ఒక విషయాన్ని చెప్పాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇక పూరి ముసింగ్స్ ఛానల్ లో ఆయన పెట్టే ప్రతి ఆడియో యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరికి దగ్గరవుతూనే ఉంటుంది ఆయన పెట్టిన ఒక ఆడియో ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది …
‘ఈ అనంత మహాసముద్రంలో అరుస్తున్న కెరటాలు, అదుపు తప్పిన గాలులు…అలల పై కలల మధ్యన గుంపులుగా జనం…ఎలాగో పోతాం…తప్పించుకునే దారేలేదు..అందుకే పోయే ముందు బతకుదాం.. ఆస్వాదిద్దాం అర్థం పరమార్థం తేల్చేద్దాం’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు జనాల గుండెల్లో తూటాల పేలుతున్నాయనే చెప్పాలి…’వలలో ఒక్క సేప చిక్కలే ఆకలి తో కడుపు మాడితే రేపటి వేట తీరు వేరేలా ఉంటది…సొర చేపలు చిక్కపోతయా..?’
అంటూ ఆయన ప్రతి ఒక్కరికి మోటివేషన్ ఇచ్చేలా నిత్యం యుద్ధం చేస్తూ బ్రతకాలి బ్రదర్ అంటూ ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయనే చెప్పాలి. నిజానికి పూరి జగన్నాధ్ మాటలు చాలా పదనుగా ఉంటాయి. ప్రతి ఒక్కరిని గుచ్చుకునే విధంగా ఉంటాయి. ఆయన సినిమాలో హీరోలు చెప్పే డైలాగులు కూడా అలాగే ఉంటాయి. అందువల్లే అతనికి చాలా గుర్తింపు అయితే వచ్చింది.
పూరి జగన్నాధ్ లాంటి దర్శకుడు ఒక సినిమాలో హీరో ఎలాంటి డైలాగులు అయితే వాడుతాడో ఆ డైలాగ్ లు చాలా ఎక్కువ రోజుల పాటు జనాల్లో వినిపిస్తూ ఉంటాయి. అంటే అంత ఫేమస్ అవుతూ ఉంటాయి నిజానికి ఆయన సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టే సినిమాలు తీసి దాంట్లో నుంచే డైలాగులు రాయాలని సంకల్పంతో ముందుకు సాగుతాడు. కాబట్టి ఆయన సినిమాల్లో డైలాగులు కేవలం మాటలుగానే కాకుండా సగటు మనిషి జీవితాల్లో నుంచి మాట్లాడే మాటల మాదిరిగా మనకు కనిపిస్తూ ఉంటాయి…