https://oktelugu.com/

Viral Video: వామ్మో ఐస్‌క్రీమ్ బిర్యానీనా.. ఇక జన్మలో బిర్యానీ తినాలనిపించదే!

ప్రస్తుతం అంతా డిజిటల్ మీడియా అయిపోవడంతో అందరూ కూడా సోషల్ మీడియాకి బానిస అవుతున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వింత రకాల వంటల వంటలు వైరల్ అవుతున్నాయి. వీడియోలకి వ్యూస్ రావాలని చాలా మంది చాక్లెట్‌తో బజ్జీ, చాక్లెట్‌తో బిర్యానీ ఇలా వింత వంటలు అన్ని కూడా చేస్తుంటారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 2, 2025 / 12:01 AM IST

    ice cream biryani

    Follow us on

    Viral Video: రోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటాయి. బాగా ఫేమస్ కావాలని, లేకపోతే వీడియో వైరల్ కావాలని కొందరు కొన్ని వీడియోలను తీసి సోషల్ మీడియాలో పెడుతుంటారు. ప్రస్తుతం అంతా డిజిటల్ మీడియా అయిపోవడంతో అందరూ కూడా సోషల్ మీడియాకి బానిస అవుతున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వింత రకాల వంటల వంటలు వైరల్ అవుతున్నాయి. వీడియోలకి వ్యూస్ రావాలని చాలా మంది చాక్లెట్‌తో బజ్జీ, చాక్లెట్‌తో బిర్యానీ ఇలా వింత వంటలు అన్ని కూడా చేస్తుంటారు. ఇలాంటి వంటలు చూస్తేనే ఇంకా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అంతా పోతుంది. అసలు జన్మలో ఆ పదార్థాల జోలికి పోలేరు. అలాంటిది చేసి తింటే వామ్మో.. ఇక చెప్పక్కర్లేదు. రోజుకి ఇలా లెక్క లేని వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఓ మహిళ ఐస్‌క్రీమ్‌తో బిర్యానీ తయారు చేసింది. సాధారణంగా ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. అయిన కూడా బిర్యానీ తయారీ విధానాన్ని వివరించింది. అసలు బిర్యానీ, ఐస్ క్రీమ్ కాంబో కొత్తగా ఉండటంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

    ఐస్ క్రీమ్ బిర్యానీ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు ఆహార విషయంలో ఇలాంటి ప్రయోగాలు చేస్తారా? ఇలాంటి ఫుడ్ తింటే బతుకుతారా? ఫుడ్ పాయిజన్ అయి చనిపోతే ఏం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు బిర్యానీ, ఐస్‌క్రీం కాంబో ఎలా తింటారని కొందరు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వల్ల ఇలాంటి వీడియోలు చేసి పెడుతున్నారు. దీంతో చాలా మంది ఆ పదార్థాలను ట్రై చేస్తే.. అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. బిర్యానీ అంటే ఇష్టం ఉన్నవారు కూడా ఇక బిర్యానీ తినడం మానేస్తారని అంటున్నారు. జన్మలో మళ్లీ బిర్యానీ తినరని అంటున్నారు. మొదట్లో మ్యాగీ ఐస్‌క్రీమ్ తయారు చేశారు.. ఇప్పడు బిర్యానీ ఐస్‌క్రీమ్ చేస్తున్నారు. ఇలాంటివి తినడానికి కాదని, కేవలం వైరల్ కావడానికి మాత్రమే చేస్తున్నారని నెటిజన్లు అంటున్నారు.

    సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. ఇవి డైలీ వైరల్ అవుతూనే ఉంటాయి. కేవలం వైరల్ కోసమే ఇలాంటి కొత్త రకం వంటలు తయారు చేసి పెడుతుంటారు. ఇలాంటి వీడియోలను పెట్టడం వల్ల ఇతరులు చూసి వాటిని చేస్తుంటారు. పొరపాటున ఏమైనా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి వీడియోలు షేర్ చేయకపోవడం మంచిది.