Electric cars sale 2024: కారు కొనాలనే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కార్యాలయ అవసరాలో పాటు ఫ్యామిలీతో కలిసి ప్రయాణాలు చేయాలని అనుకునేవారు సొంతంగా వెహికల్ ఉండాలని అనుకుంటున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతుండడంతో ఎక్కువ మంది కారు కొనాలని అనుకునేవారు ఈవీల వైపు మళ్లుతున్నారు. ఎలక్ట్రిక్ కార్లు తక్కువ ధరకే ఎక్కువ మైలేజ్ ఇవ్వడంతో పాటు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే విధంగా ఉన్నాయి. ఈ క్రమంలో 2024 ఏడాది వారీగా అమ్మకాలను పరిశీలిస్తే పెట్రోల్,డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలే ఉపందుకున్నాయి. 2023 ఏడాదితో పోలిస్తే 2024లో ఎలక్ట్రిక్ కార్లు 26.5 శాతం పెరిగాయని డేటా తెలుపుతోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
2024 ఏడాది పూర్తయిన సందర్భంగా ఇటీవల రోడ్డు రవాణా శాఖ కార్ల అమ్మకాల డేటాను రిలీజ్ చేసింది. దీని ప్రకారం గత ఏడాదిలో ఈవీల సేల్స్ పెరిగాయి. 2024 ఏడాదిలో డిసెంబర్ 29 నాటికి మొత్తం 2.604 యూనిట్ల కార్లు విక్రయాలు జరిగాయి. వీటిలో పెట్రోల్ వాహనాలు 73.69 శాతంతో మొదటిస్థానంలో నిలిచాయి. ఆ తరువాత డిజిల్ వాహనాలు 10.05 శాతంగా ఉన్నాయి. సీఎజీ, హైబ్రిడ్ వాహనాలు 9.87 శాతంగా ఉన్నాయి. అయితే ఈ ఏడాదిలో ప్రతి ఈవీకి 12.43 పెట్రోల్, హైబ్రిడ్, డీజిల్ వాహనాలు అమ్ముడు పోయాయి. ఈ పరిస్థితి 2022లో 21.05 శాతం ఉండగా.. 2023 నాటికి 15.67 శాతానికి పెరిగింది. 2024లో మంచి ఫలితాలు ఇచ్చాయి.
2024 ఏడాది ప్రారంభంలోనే ఈవీలకు మంచి ఆదరణ లభించింది. గత జనవరిలో 1,45,064 ఎలక్ట్రిక్ కార్లు విక్రయాలు జరుపుకున్నాయి. మార్చినాటికి ఇవి 2,13,068కి చేరుకున్నాయి. అయితే ఏప్రిల్ లో మాత్రం వీటి సేల్స్ తగ్గాయి. డిసెంబర్ నెలలో 1,15,898 విక్రయాలు జరుపుకున్నాయి. కంపెనీలు ఆఫర్లు ప్రకటించడంతో పాటు పండుగ సీజన్లో ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగింది. కొన్ని కంపెనీలు తగ్గింపు ధరలు ప్రకటించడంతో వీటిని ఎక్కువ మంది కొనుగోలు చేశారు.
ఈవీల సేల్స్ పెంచడానికి ప్రభుత్వం సైతం ప్రోట్సహిస్తోంది. పీఎం ఈ డ్రైవ్ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ పెరిగాయన్న చర్చ సాగుతోంది. అయితే అక్టోబర్ లో సేల్స్ పెరిగి.. నవంబర్, డిసెంబర్ లో తగ్గిపోవడం చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కానీ కొత్త ఏడాదిలో వీటి సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. వినియోగదారుల అభిరుచులు మారడంతో పాటు తక్కువ ధరకే ఈవీలు అనుగుణంగా ఉండడంతో చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే ఇవి అన్ని విధాలుగా ఆకట్టుకుంటున్నాయి.
గతంలో ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఎక్కువగా ఉండేవి. అంతేకాకుండా వీటికి ఛార్జింగ్ సమస్య ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడంతో పాటు తక్కువ సమయంలో స్పీడ్ చార్జీంగ్ అయ్యే బ్యాటరీలను అమరుస్తున్నారు. దీంతో ఈవీల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.