Viral Video : కంగారు జట్టు ఇదే సిద్ధాంతాన్ని పాటిస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఆ జట్టులో కొత్త కొత్త ప్లేయర్లు పుట్టుకొస్తారు. వారంతా అద్భుతంగా ఆడి జట్టు విజయాలను కృషి చేస్తారు. మన క్రికెట్ జట్టులో కూడా ఇలాంటి విధానమైన సాగుతున్నప్పటికీ.. అప్పుడప్పుడు కొంతమంది సీనియర్ ప్లేయర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. అడ్డగోలుగా ప్రవర్తిస్తుంటారు. జూనియర్ ఆటగాళ్లపై తమ పెత్తనాన్ని ప్రదర్శిస్తుంటారు. దానివల్ల జూనియర్ ప్లేయర్లు ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇలాంటి విషయాలు ఎక్కువగా వెలుగులోకి రావు. వెలుగులోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులు మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత అదంతా సర్వసాధారణమైన వ్యవహారం లాగానే ఉంటుంది.
ఇటీవల క్వాలిఫైయర్-1 మ్యాచ్ జరుగుతున్నప్పుడు కన్నడ జట్టు ఆటగాడు విరాట్ .. పంజాబ్ జట్టు యువ ఆటగాడు ముషీర్ ఖాన్ ను గేలి చేశాడు. నీళ్ల సీసాలు పట్టుకొచ్చిన వాడు బ్యాటింగ్ కు వచ్చాడ్రా అంటూ ఎగతాళి చేశాడు. వాస్తవానికి ముషీర్ ఖాన్ ఎలా ఆడతాడో విరాట్ కోహ్లీకి తెలుసు. పైగా విరాట్ కోహ్లీ ముషీర్ ఖాన్ కు అప్పట్లో ఒక బ్యాట్ కూడా బహుమతిగా ఇచ్చాడు. అయినప్పటికీ అవి పట్టించుకోని విరాట్ ముషీర్ ఖాన్ ను గేలి చేశాడు. విరాట్ కోహ్లీ అడ్డగోలు మాటలు దెబ్బకు ముషీర్ ఖాన్ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. తద్వారా అతడు ఫైనల్ మ్యాచ్లో అయ్యర్ జట్టు తరఫున ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. ఒక రకంగా ముషీర్ ఖాన్ కు ఫైనల్ అడవి జట్టులో స్థానం లభించకపోవడానికి కారణం విరాట్ కోహ్లీనే. కర్ణాటక జట్టు స్టార్ ఆటగాడు అలాంటి ఆరోపణలు చేసినప్పటికీ ముషీర్ ఖాన్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
ఇక కన్నడ జట్టుతో జరిగిన చివరి అంచె పోటీలో ఓడిపోయిన నేపథ్యంలో.. అయ్యర్ జట్టు ఒక్కసారిగా నిరాశకు గురైంది. అయినప్పటికీ వచ్చే సీజన్లో తమ సత్తా చూపిస్తామని ప్రతిజ్ఞ చేసింది. ఇక ఈ క్రమంలో పంజాబ్ జట్టు ఆటగాడు ముషీర్ ఖాన్ గురించి ఒక విషయం వెలుగులోకి వచ్చింది.. అహ్మదాబాద్ లో మ్యాచ్ పూర్తయిన తర్వాత ముషీర్ ఖాన్ విమానంలో తెల్లవారుజామున 5 గంటలకు ముంబై చేరుకున్నాడు. ఆ తర్వాత కొన్ని గంటల విశ్రాంతి తీసుకొని వెంటనే ముంబై టీ20 లీగ్ లో ఆడుతున్నాడు. అంతేకాదు తొలి ఓవర్లో అతడు వికెట్ కూడా పడగొట్టాడు. అతని డెడికేషన్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ” చూడవయ్యా విరాట్ కోహ్లీ.. ముషీర్ ఖాన్ వ్యక్తిత్వం.. నువ్వు నీళ్ల సీసాలు తీసుకొచ్చిన వ్యక్తి అని హేళన చేశావు. అతడు ముంబై జట్టు కోసం ఏకంగా ఇక్కడిదాకా వచ్చాడు. దీనిని డెడికేషన్ అంటారని” సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు.
Yesterday – Was with the Punjab Kings team during the IPL final.
Came to Mumbai around 5 am today.
Now – Playing in the T20 Mumbai League and took the wicket in the first over.
The Commitment of Musheer Khan pic.twitter.com/zT0qCjeWCL
— Johns. (@CricCrazyJohns) June 4, 2025