https://oktelugu.com/

Viral Video : భారత్ గెలిచిందని రచ్చ రచ్చ చేశారు.. పోలీసులు గుండ్లు కొట్టించి ఇంటికి పంపించారు.. వైరల్ వీడియో

Viral Video  : ఉత్సాహం ఒక స్థాయి వరకు బాగుంటుంది. ఆనందం ఒక పరిమితి వరకు బాగుంటుంది. కేరింతకు ఒక గీత ఉంటుంది. ఇవన్నీ హద్దు దాటితే పరిస్థితి తేడా అవుతుంది. ఆ తర్వాత చింతించినా ఉపయోగం ఉండదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 12, 2025 / 01:40 PM IST
    Viral Video on Madya Pradesh

    Viral Video on Madya Pradesh

    Follow us on

    Viral Video  : ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా గెలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో భారత్ విజయ ఢంకా మోగించింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. వాస్తవానికి 2017లో టీమిండియా ఫైనల్ వెళ్లినప్పటికీ.. పాకిస్తాన్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. దీంతో టీమిండియా నిరాశతో వెను తిరగాల్సి వచ్చింది. ఒకవేళ 2017 లో జరిగిన ఫైనల్ లో టీమిండియా కనుక గెలిచి ఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో హ్యాట్రిక్ సాధించేది.. 2013లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. ఇక 2025 లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ని టీమిండియా గెలవడంతో సంబరాలు మిన్నంటాయి. దేశ వ్యాప్తంగా అభిమానులు వేడుకలు జరుపుకున్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్ ఎదురుగా వేలాదిమంది అభిమానులు వచ్చి కేరింతలు కొట్టారు.

    Also Read : పుష్ప కాదు.. డాలీ అంటేనే ఓబ్రాండ్.. ఏకంగా దుబాయ్ మైదానాన్నే దున్నేశాడుగా..

    గుండ్లు కొట్టించారు

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకొని అక్కడి అభిమానులు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. ద్విచక్ర వాహనాల మీద రైడ్ చేస్తూ.. ర్యాలీ నిర్వహించారు. కొందరైతే జాతీయ జెండాను పట్టుకొని ప్రధాన వీధులలో ప్రదర్శనలు జరిపారు. ఇంతవరకైతే బాగానే ఉండేది.. వీరిలో కొంతమంది డీజే లు పెట్టుకుని.. హోరెత్తించే సౌండ్ మధ్య డ్యాన్సులు వేశారు. వారు చేసిన నిర్వాకం వల్ల చాలామందికి ఇబ్బంది కలిగింది. ఇంకా కొంతమంది అయితే తమ ద్విచక్ర వాహనాల సైలెన్సర్లకు ఏమో పరికరాలు అమర్చి.. శబ్దం భారీగా వచ్చేలా చేశారు. ఇవన్నీ కూడా పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. వారు రంగ ప్రవేశం చేశారు. ఆ చర్యలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో కొంతమంది మద్యం మత్తులో ఉండడంతో పోలీసులు గుండ్లు కొట్టించారు. ఇంకోసారి ఇటువంటి చేష్టలకు పాల్పడితే కేసులు నమోదు చేసి.. జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అయితే ఈ ఘటన మధ్యప్రదేశ్లో రాజకీయంగా మారింది. పోలీసులు యువకులకు గుండ్లు కొట్టించడాన్ని స్థానిక ఎమ్మెల్యే తప్పు పట్టారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ యువకులు తప్పు చేసి ఉంటే వారిని జైలుకు పంపించాల్సి ఉండేదని.. ఇలా గుండ్లు కొట్టించడం ఏంటని ఆమె మండిపడ్డారు..” యువకులు దేశం గెలిచిందనే ఉత్సాహంతో ఉన్నారు. వారు డ్యాన్సులు వేశారు.. ఇంకా రకరకాల విన్యాసాలు చేశారు. అవి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీసులు మరో రూపంలో చర్యలు తీసుకోవాల్సి ఉండేది. కానీ ఇలా గుండ్లు కొట్టించడం బాగోలేదు. వారిని దేశ ద్రోహులుగా పోలీసులు చిత్రీకరించడం అసలు బాగోలేదు. ఇలాంటి ఘటనలు ఇంకోసారి జరగకుండా చూడాలంటే పోలీసులు మరో విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉండేది. ఏది ఏమైనప్పటికీ వారు చేసిన పని ఇబ్బందికరంగా ఉందని” ఎమ్మెల్యే మీడియాతో వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా స్పందించారు. వివరణ ఇవ్వాలని ఎస్సై, ఇతర సిబ్బందికి నోటీసులు జారీ చేశారు.

    Also Read :నవ్వినంత మాత్రాన ఒత్తిడి తగ్గిపోలేదు.. గౌతమ్ గంభీర్ ముందు ఎన్నో చిక్కుముడులు.. ఎలా విప్పుతాడో చూడాలి..