Dolly Chaiwala: డాలి అంటే బొమ్మ అనుకునేరు. డాలి అంటే ఓ చాయ్ మాస్టర్.. ముంబైలో ఓ మామూలు వీధిలో చాయ్ మాస్టర్ గా ఉన్న అతడు సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీ అయిపోయాడు. మన దగ్గర కుమారి ఆంటీ ఎలా అయితే ఫేమసో.. డాలి మాస్టర్ కూడా ముంబై వీధిలో అంతే ఫేమస్. అతడు చేసే వేడి వేడి చాయ్ కి ముంబైలో లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. సుతారంగా చాయి రెడీ చేయడం.. ఏకంగా మూతి దగ్గరికి గాజు గ్లాస్ ను పెట్టడం అతడికే సాధ్యం. ఈ మేనరిజం వల్లే అతడు ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయాడు. పైగా బిల్ గేట్స్ లాంటి అపర కుబేరుడుని తన వద్దకు వచ్చేలా చేశాడు. ఆమధ్య ముఖేష్ అంబానీ కుమారుడి ముందస్తు వివాహ వేడుకకు బిల్గేట్స్ హాజరయ్యారు. ముఖేష్ అంబానీ ఇంటికి వెళ్లకుండా నేరుగా డాలి మాస్టర్ దగ్గరికి వచ్చారు. అతడు చాయ్ తయారు చేసిన విధానం చూసి ఆశ్చర్యపోయారు. అతడు తయారు చేసిన చాయ్ తాగి పరవశించిపోయారు.
Also Read: భయంకరమైన బ్యాటర్లు ఎంతమందున్నా.. మిస్టర్ ఐసీసీ కోహ్లీనే.. ఎందుకంటే?
ఇప్పుడు దుబాయ్ మైదానంలో..
దుబాయ్ మైదానంలో ఇటీవల టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడింది. ఈ మైదానంలో దాదాపు 5 మ్యాచులు టీమిండియా ఆడింది. ఐదింట్లోను టీమిండియా గెలిచింది. అయితే ఈ స్టేడియంలో డాలి మాస్టర్ సందడి చేశాడు. టీం ఇండియా మ్యాచ్ ఆడే కంటే ముందు మైదానంలోకి డాలి మాస్టర్ ప్రవేశించాడు. దుబాయ్ మార్కెట్లో లభించే పాలు, టీ పొడి, అల్లం, పంచదార మిశ్రమంతో అద్భుతమైన చాయ్ తయారుచేసి.. స్టార్ స్పోర్ట్స్ వ్యాఖ్యాతలకు అందించాడు. అతడు చాయ్ తయారు చేసే విధానం సరికొత్తగా ఉండడంతో స్టార్ స్పోర్ట్స్ వ్యాఖ్యాతలు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అతడు తయారు చేసిన చాయ్ తాగి పరవశించిపోయారు. దీనికి సంబంధించి వీడియోను డాలి తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. అన్నట్టు డాలిది సొంత ప్రాంతం నాగ్ పూర్. అతడు నాగ్ పూర్ ప్రాంతం తో పాటు ముంబైలోను చాయ్ తయారు చేస్తాడు. అతడి చాయ్ కి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. అంతగా చదువుకోకపోయినా.. కేవలం చాయ్ తయారు చేయడం ద్వారా డాలి ఫేమస్ అయిపోయాడు. మన దేశాన్ని దాటి ఏకంగా దుబాయిలో తన చాయ్ తయారీని ప్రదర్శించాడు. అందు గురించే చేసే పనిపై ప్రేమ ఉంటే ఎక్కడి దాకైనా వెళ్లొచ్చు అంటారు. దానిని నిజ జీవితంలో డాలి చాయ్ మాస్టర్ నిరూపించాడు. ఎంతోమందికి ప్రేరణగా నిలిచాడు.