https://oktelugu.com/

Viral  Video  :  డబ్బుంటే సంతోషాన్ని కూడా కొనవచ్చు.. అవసరమైతే సముద్రంపై తలగడ వేసుకొని పడుకోవచ్చు.. వీడియో వైరల్

ఇన్ స్టా గ్రామ్ లో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సముద్ర జలాలపై ఒక షిప్ కాలంతో వేగంగా పరుగులు పెడుతోంది. సముద్ర జలాల వేగాన్ని మించి దూసుకెళ్తోంది. ఆ నౌక వేగం తాలూకూ నీటి అలలు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. ఇదే సమయంలో కొంతమంది యువతులు (బహుశా స్నేహితులై ఉంటారు) పక్కపక్కనే పడుకున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 5, 2024 / 05:06 PM IST
    Follow us on

    Viral  Video :  ఇటీవల ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికతో జరిగింది.. కనీ వినీ ఎరుగని స్థాయిలో అంబానీ కుటుంబం ఏర్పాట్లు చేసింది. నభూతో నభవిష్యతి ఆమె తీరుగా వేడుకలు జరిపించింది. ఆ బాలగోపాలం నుంచి అతిరథ మహారధుల వరకు ఈ వివాహానికి హాజరయ్యారు.. ఇదే సమయంలో కొందరు అనంత్ అంబానీ భారీ కాయాన్ని చూసి గేలి చేశారు. “అంబానీ ఎంత స్థాయిలో వేడుకలు జరిపితే ఏంటి.. అనంత్ స్థూలకాయత్వాన్ని తగ్గించలేదు కదా? అది అతడికి మైనస్ పాయింటే కదా?” అంటూ విమర్శలు చేశారు. నిజమే అంబానీ దగ్గర లక్షల కోట్ల సంపద ఉంది. కొండమీద కోతినైనా తెచ్చి ఇవ్వగల సామర్థ్యం ఉంది. అయినప్పటికీ అనంత్ బరువును తగ్గించలేకపోయాడు. అతడి రుగ్మతను నయం చేయించలేకపోయాడు. అందుకే డబ్బుంటే అన్ని వస్తాయనుకుంటాం గానీ.. అపరిమితమైన డబ్బు ఉన్నప్పటికీ కొనుగోలు చేయలేనివి, పొందలేనివి చాలా ఉంటాయి. అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో “డబ్బుతో సంతోషం కొనలేం అనుకుంటాం కానీ.. కచ్చితంగా కొనొచ్చని” నిరూపిస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

    ఇన్ స్టా గ్రామ్ లో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం..

    ఇన్ స్టా గ్రామ్ లో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సముద్ర జలాలపై ఒక షిప్ కాలంతో వేగంగా పరుగులు పెడుతోంది. సముద్ర జలాల వేగాన్ని మించి దూసుకెళ్తోంది. ఆ నౌక వేగం తాలూకూ నీటి అలలు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. ఇదే సమయంలో కొంతమంది యువతులు (బహుశా స్నేహితులై ఉంటారు) పక్కపక్కనే పడుకున్నారు. నెత్తి కింద తలగడ పెట్టుకొని.. సముద్ర జలాల హోరును తమ చెవులారా వింటూ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. అప్పటికి ఇంకా పూర్తిగా తెలవారలేదు. మగత నిద్రలో.. కలలు కంటూ.. నీటిపై అత్యంత వేగంగా ప్రయాణిస్తూ జీవితానికి సరిపడిన అనుభూతిని వారు సొంతం చేసుకుంటున్నారు. ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ.. నీటి అలలను కలలోకి నింపుకుంటూ స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నారు..

    లక్షల్లో వ్యూస్

    ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. వేలాదిమంది ఈ వీడియో పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు..”జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఏమవుతుందో మనకే తెలియదు. ఈ క్షణం గ్యారంటీ అని చెప్పలేం. కానీ ఆ జీవితాన్ని కొంతమంది అద్భుతంగా జీవిస్తారు. సరికొత్త అనుభూతులను సొంతం చేసుకుంటారు.” ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు..”సముద్ర జలాలు పోటెత్తుతున్నాయి. నౌక మీద ప్రయాణం హాయిగా సాగిపోతోంది. ఎటువంటి బాధ లేకుండా వారి గమనం అద్భుతంగా ఉంది. కొన్ని కొన్ని విషయాలను ఎక్కువగా వర్ణించకపోవడమే మంచిదని” మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు..”డబ్బుతో సంతోషాన్ని కొనలేమని చాలామంది అంటుంటారు. వీరిని చూస్తే ఖచ్చితంగా ఆ మాట వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతటి అనుభూతి సొంతమైందంటే అది మామూలు విషయం కాదు. వీరంతా పూర్వజన్మలో ఏదో పుణ్యం తీసుకొని ఉండుంటారు” అంటూ మరో యువతి వ్యాఖ్యానించింది. అయితే ఆ యువతులు ప్రయాణిస్తున్న నౌకలో బ్యాక్ అండ్ ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉంది. చూడబోతే ఆ నౌకను వీరు ప్రత్యేకంగా బుక్ చేసుకొనట్టు కనిపిస్తోంది. సముద్రం మీద నుంచి వచ్చే చల్లటి గాలులు వారి కురులను వింజామరలాగా నిమురుతున్నాయి. అనంతమైన సంతోషాన్ని, అనితర సాధ్యమైన ఆనందాన్ని వారికి అందిస్తున్నాయి. ఇదే సమయంలో చూసే వారికి సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి.