https://oktelugu.com/

Rocking Rakesh: జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్ కపుల్స్ షాకింగ్ ఫొటోస్ రిలీజ్.. ఇందులో ఎలా ఉన్నారంటే?

జబర్దస్త్ ఫేం రాకేష్, జోర్దార్ సుజాత జోడి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు ఆ తరువాత జీవితంలో స్థిరపడ్డారు. రాకేష్ జబర్దస్త్ లో కొనసాగుతుండగా.. జోర్దార్ సుజాత యాంకర్ గా నటిస్తూనే..

Written By:
  • Srinivas
  • , Updated On : August 5, 2024 / 05:09 PM IST

    Jabardasth Actor Rocking Rakesh Couples Shocking Photos

    Follow us on

    Rocking Rakesh: సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఒకే వేదికపై నటించి.. ఆ తరువాత జీవితానని పంచుకున్న వారు ఎందరో ఉన్నారు. వెండితెర నుంచి బుల్లితెర వరకు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కొందరు నిజ జీవితంలో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు షేర్ చేస్తుంటారు. అలాంటి వారిలో రాకేష్, జోర్దార్ సుజాత ఒకరు. జబర్దస్త్ అనే ప్రోగ్రాం ఎంతో మందికి జీవితాన్ని అందించింది. ఈ వేదికపైకి వచ్చిన వాళ్లు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సైతం స్టార్లుగా కొనసాగుతున్నారు. మరికొందరు ఇదే వేదికపై కొనసాగుతున్నారు. అయితే జబర్దస్త్ వేదికపై కలిసి నటించి ఆ తరువాత జీవితంలో ఒక్కటైన వాళ్లలో రాకేష్, సుజాత ఉన్నారు. వీరు ఆ కామెడీ వేదికపై తమదైన శైలిలో పంచ్ లు, ప్రాసెస్ లతో ఆకట్టుకున్నారు. ఒకరిపై ఒకరు కామెడీ చేస్తూ నవ్వులు పూయించేవారు. అటు సోషల్ మీడియాలోనూ వీరు ఫొటోలను షేర్ చేయడంతో ఫ్యాన్స్ విపరీతంగా పెంచుకున్నారు . ఆ తరువాత వీరు ప్రేమలో ఉన్నట్లు కొన్ని రోజుల పాటు రూమర్లు వచ్చాయి. కానీ ఆ తరువాత వీరు జబర్దస్త్ వేదికపై ఒక్కటవుతున్నట్లు ప్రకటించారు. ఇక పెద్దలను ఒప్పించి వీరు పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసింది. అయితే తాజాగా వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. వీరు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. అ విషయాన్ని ఫొటోషూట్ ద్వారా వివరించి చెప్పారు. ఆ ఫొటోలు ఎలా ఉన్నాయంటే?

    జబర్దస్త్ ఫేం రాకేష్, జోర్దార్ సుజాత జోడి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు ఆ తరువాత జీవితంలో స్థిరపడ్డారు. రాకేష్ జబర్దస్త్ లో కొనసాగుతుండగా.. జోర్దార్ సుజాత యాంకర్ గా నటిస్తూనే.. కొన్ని సినిమాల్లో సైడ్ హీరోయిన్ గా కూడా నటించారు. ‘సేవ్ టైగర్స్’ లనే సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో జోర్దార్ సుజాత ఒకరుగా ఉన్నారు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో మెరిసిన ఆమె కొన్నాళ్ల పాటు కనపించలేదు. దీంతో చాలా మంది జోర్దార్ సుజాత ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారా? అనే చర్చ సాగింది.

    కానీ ఒక్కసారిగా రాకేష్ కపుల్స్ మెటర్నిటీ ఫొటో షూట్ లో కనిపించారు. వీరికి త్వరలో పండండి బిడ్డ పుట్టబోతున్నట్లు ఫొటోల ద్వారా తెలిపారు. ఈ ఫొటోల్లో క్యూట్ కపుల్ ఎంతో హ్యపీగా కనిపిస్తున్నారు. తమ జీవితంలో కొత్త వ్యక్తి రాబోతున్నట్లు ప్రకటించారు. ఇన్నాళ్లు రాకేష్ గుడ్ న్యూస్ చెబుతారని కొందరు పోస్టులు పెట్టినా ఆయన స్పందించలేదు. అటు సుజాత కూడా ఈ విషయంపై స్పందించలేదు. కానీ ఒక్కసారిగా వీరు కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అంతా షాక్ అయ్యారు. దీంతో వారు ఇంప్రెస్ అవుతున్నట్లు మెసేజ్ లు పెట్టారు.

    ప్రస్తుతం సుజాత తొమ్మిది నెలల గర్బిణి అని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ ఫొటోల్లో రాకేష్ తో పాటు కొంత మంది బంధువులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఫొటోలతో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. కొందరు తొందర్లో రాకేష్ తండ్రిగా ప్రమోషన్ సాధిస్తున్నాడని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు రాకేష్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫొటోలపై సినీ ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు జబర్దస్త్ యాక్టర్స్ స్పందిస్తున్నారు. తమదైన శైలిలో ఈ క్యూట్ కపుల్స్ కు విషెష్ చెబుతున్నారు.