Viral Video : ఆలా తన భార్యను తన బైక్ వెనుక కూర్చోబెట్టుకొని నడపడంతో.. ఒక్కసారిగా సింహబలుడు అయిపోయాడు. తలకు హెల్మెట్ లేకున్నా.. బండి స్పీడ్ గా వెళ్లకున్నా.. పక్కనే ఉన్న సింహాన్ని లైట్ తీసుకున్నాడు. వెనకాల కూర్చున్న భార్యతో సరదాగా వెళ్ళిపోయాడు. సోషల్ మీడియాను ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది.. ఆ వీడియోలో దట్టమైన అడవి ఉంది. ఆ అడవి మధ్యలో ఒక మట్టి రోడ్డు ఉంది. దానిపై ఓ భార్యాభర్త ప్రయాణిస్తున్నారు. బైక్ వెనకాల భార్య కూర్చుంది. వారిద్దరూ ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. రోడ్డు పక్కనే ఒక సింహం అలా పడుకుని ఉంది. కాకపోతే నిద్రపోలేదు. అలా భార్యాభర్తలు పైకి పై వెళ్తుంటే అలా చూస్తూ ఉండిపోయింది గాని.. దాడి చేయలేదు. కాకపోతే దగ్గరగా వెళ్తే తన నోటికి పని చెప్పేది. పంజా దెబ్బ రుచి చూపించేది. కానీ వెంట్రుకవాసిలో అది తప్పిపోయింది. అయితే ఆ సింహాన్ని ఆ భార్యాభర్తలు గమనించినట్టున్నారు. అందువల్లే తమదారులు తాము వెళ్ళిపోయారు. దీనిని ఎవరు వీడియో తీసారో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది.
గ్రాఫిక్స్ ఏమైనా చేశారా
అయితే కొంతమంది ఈ వీడియోని చూసి ఆ సింహం కూర్చున్న తీరు గ్రాఫిక్స్ అని అంటున్నారు. ” ఆ రోడ్డు మార్గం అత్యంత భయానకంగా ఉంది. సింహం కూర్చున్న ప్రాంతం చదనుగా ఉంది కొంతమంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఇలాంటి వీడియోలను సృష్టిస్తారు. ఇది కూడా అలాంటిదే. అయితే ఆ సింహాన్ని ఆ మహిళ భర్త చూడలేదా? చూసినా కూడా తన వెనుక సింహం లాంటి భార్య ఉందని అనుకున్నాడా?” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..ఆ భార్యాభర్తలు వెళ్తున్న మార్గం రాజస్థాన్ రాష్ట్రాన్ని పోలినట్టు కనిపిస్తోంది.. ఎందుకంటే ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ ప్రాంతంలోని గిర్ అడవుల్లోనే అలాంటి వృక్షాలు ఉంటాయి. సింహాలు కూడా అక్కడే ఎక్కువగా ఉంటాయి. అవి అప్పుడప్పుడు జనావాస ప్రాంతాలకు వచ్చి దాడులు చేస్తుంటాయి. అయితే ఈ వీడియోలో ఆ భార్యాభర్తకు ఆ సింహం ఎటువంటి కీడు తల పెట్టకపోవడంతో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆ సింహం దగ్గరగా వీరు వెళ్లి ఉంటే సంతాపం చెప్పాల్సి వచ్చేదని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మీరు వెళ్తున్నప్పుడు ఆ సింహం ఆకలి తో ఉండి ఉండకపోవచ్చు అని మరి కొంతమంది కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ఇన్ స్టా లో సరికొత్త చర్చకు దారితీస్తోంది.