https://oktelugu.com/

Sujana Chowdary: ఎమ్మెల్యే వద్దంటున్న సుజనా చౌదరి.. ఆ పదవి కోసం ఆరాటం!*

పూలు అమ్ముకున్నచోట.. కట్టెలు అమ్ముకోలేరు. అది మనసుకు అంగీకరించదు కూడా. ఇప్పుడు సుజనా చౌదరి అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టిన ఆయన ఓ సామాన్య ఎమ్మెల్యేగా ఉండడానికి ఇష్టపడడం లేదు.

Written By:
  • Dharma
  • , Updated On : December 5, 2024 / 11:16 AM IST

    Sujana Chowdary

    Follow us on

    Sujana Chowdary: ఏపీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాలేదు. వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఏపీలో కూటమి ఏకపక్ష విజయం సాధించడంతో.. ఇక్కడ రాజ్యసభ ఎన్నికలు సైతం ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. వైసీపీ 11 స్థానాలకే పరిమితం కావడంతో ఆ పార్టీకి చాన్స్ లేకుండా పోయింది. అయితే కూటమిలో రాజ్యసభ పదవుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు.రోజుకో వార్త తెరపైకి వస్తోంది.టిడిపికి రెండు, బిజెపికి ఒకటి అన్నట్టు ప్రచారం జరుగుతోంది. టిడిపికి సంబంధించి బీద మస్తాన్ రావుకు మరోసారి ఛాన్స్ దక్కి అవకాశం ఉంది. ఇంకోవైపు కృష్ణయ్య బిజెపి వైపు వెళ్తుండడంతో ఆ పార్టీ తరఫున మరోసారి నామినేట్ అవుతారని తెలుస్తోంది. ఇంకో పదవి టిడిపి నేత సానా సతీష్ కు ఇస్తారని సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఆయనే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి.ఆయన సైతం రాజ్యసభ పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్రమంత్రి కావాలన్నది ఆయన కోరిక. కానీ ఈసారి ఆ చాన్స్ లేకుండా పోయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు సుజన. మంత్రి పదవి దక్కలేదు. ఒక సామాన్య ఎమ్మెల్యేగా మిగిలి పోవడంతో ఆయనలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. ఈ తరుణంలో అందర్నీ ఒప్పించి రాజ్యసభకు వెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

    * రెండుసార్లు ఎంపీగా
    తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు సుజనా చౌదరి. రెండుసార్లు ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. 12 సంవత్సరాలు పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 2022 వరకు అదే పదవిలో ఉన్నారు. కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడితో పాటు కేంద్ర మంత్రి కావాలన్నది సుజనా చౌదరి ఆలోచన. అయితే ఈసారి ఎమ్మెల్యే అయితే చంద్రబాబు సర్కార్లో మంత్రి పదవి పొందవచ్చు అని ఆలోచన చేశారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు ఛాన్స్ దక్కలేదు.అనవసరంగా ఎమ్మెల్యేగా పోటీ చేశానన్న బాధ ఆయనలో ఉంది. అందుకే ఇప్పుడు రాజ్యసభకు వెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

    * సాధ్యమేనా?
    అయితే ఆయన రాజ్యసభకు వెళితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.అదే జరిగితే ఉప ఎన్నిక అనివార్యం. అంత రిస్క్ చేసి వెళ్లగలరా అన్నది అనుమానం. అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి. ఆయన పట్టు పడితే మాత్రం ఒప్పుకునే అవకాశం ఉంది.అయితే ఎప్పటికీ బిజెపి తరఫున కృష్ణయ్య పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రెండో పదవి బిజెపికి టిడిపి వదులుకుంటుందా?అన్నది అనుమానమే. అటు రెండో పదవి పొందడంతో పాటు విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నికను ఎదుర్కోవడం అంత సామాన్యం కాదు. అందుకే సుజనా చౌదరి రాజ్యసభకు ఎంపిక అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలి.