Honey badgers : వాటి కళ్ళల్లో భయం ఉండదు.. ఒంట్లో బెదురు ఉండదు..టోటల్ గా భయం అనే పదానికి చోటు లేదు… అలాగని అది పెద్ద జంతువు కాదు… చూడడానికి పెద్ద ముంగిసలా ఉంటుంది. పెద్ద పులి నైనా మట్టికరిపిస్తుంది. ఇంతకీ ఈ జంతువు పేరు తెలుసా? తేనె కుక్క అలియాస్ హనీ బ్యాడ్జర్. పొట్టిదైనా గట్టి పిండం ఇది. చుట్టూ సింహాలు, పులులు వెంటాడుతున్న భయపడని గుణం దాని సొంతం. పెద్దపులి, చిరుత పులి, ఎలుగుబంటి, ఆఖరికి ఏనుగు లాంటి జంతువులపై కూడా ధైర్యంగా పోరాడే తత్వం దీని సొంతం. ప్రపంచంలోనే భయం లేని జంతువు ఏదైనా ఉంటే అది తేనె కుక్క మాత్రమే. ఈ అరుదైన జంతుజాలం నల్లమల అడవుల్లో కనిపిస్తోంది. మరోవైపు పాపికొండల్లో కూడా వీటి సంచారం అధికమని తేలుతోంది. అయితే ప్రపంచంలోనే అరుదైన ఈ జంతువు మన రాష్ట్రంలో కనిపించడం విశేషం.
* మిగిలిన జంతువులకు హడల్
తేనె కుక్క వస్తుందంటే చాలు మిగిలిన జంతువులు హడలెత్తిపోతాయి. ఎంత పెద్ద జంతువైనా దారి ఇవ్వక తప్పదు. అడవిలో వీటి దారి రహదారి. రజినీకాంత్ చెప్పినట్టు బెటర్ డోంట్ కమింగ్ మై వే అన్నట్టు ఉంటుంది వీటి వ్యవహార శైలి. పొరపాటున ఏ జంతువు అయినా అడ్డంగా వస్తే తిరుగుబాటు తప్పదు. కనీసం పాములు కూడా వీటిని ఏమీ చేయలేవు. అలాగని ఇది పెద్ద జంతువు కాదు. దీని ఎత్తు కేవలం 12 అంగుళాలు. వాటి పంజా అంతా గోళ్ళ రూపంలో ఉంటాయి. అవి కూడా మూడు అంగుళాల పొడవు ఉంటాయి. పది కిలోల మించి బరువు ఉండదు. చూడడానికి అచ్చం ఎలుగుబంటిలా ఉంటుంది. అయినా సరే క్రూర మృగాలను సైతం మట్టి కరిపించగలదు.
* వీడియో హల్ చల్
తాజాగా ఈ తేనె కుక్కలకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు తేనె కుక్కలు ఏకంగా ఏడు సింహాలకు చుక్కలు చూపించాయి ఆ వీడియోలు. వాటిని చంపేందుకు ఆ సింహం గుంపు ప్రయత్నించింది. కానీ ఆ రెండు తేనె కుక్కలు మాత్రం సింహాలతో ధైర్యంగా పోరాడాయి. వాటిని ఎదిరించి ప్రాణాలు దక్కించుకున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఏడు లక్షల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. దాదాపు 5000 మంది ఈ వీడియోను లైక్ చేశారు. దీనిపై నేటిజన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.
* సంరక్షించాలి
అయితే ఇంతటి అరుదైన జంతువులు మన రాష్ట్రంలో నల్లమల ఫారెస్ట్ తో పాటు పాపికొండల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతటిప్రత్యేకత కలిగినజంతు జాతిని సంరక్షించాల్సిన అవసరం ఉంది.వాటిని కాపాడి వాటి సంతతిని పెంచాల్సిన అవసరం ఉందని జంతు ప్రేమికులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ తేనె కుక్కల సాహస వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. వాటిని చూసేందుకు నెటిజెన్లు ఆసక్తి చూపుతున్నారు. ఆసక్తికరమైన కామెంట్లు పెడుతున్నారు.
These two honey badgers decide to take on a group of SEVEN lions. pic.twitter.com/HCx1dknsyz
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) September 3, 2024