Chiranjeevi: కొంతమంది స్టార్ హీరోలు వాళ్ల కోసం ప్రాణాలను ఇచ్చే అభిమానులను సంపాదించుకుంటారు దీనికి కారణం వాళ్ళు చేస్తున్న సినిమాలే కాకుండా వాళ్ళ వ్యక్తిత్వం మీద కూడా ఆధారపడి ఉంటుంది. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా 40 సంవత్సరాల పాటు ఇండస్ట్రీని ఏకచత్రాధిపత్యంతో ఏలుతున్న ఒకే ఒక్కడు మెగాస్టార్ చిరంజీవి…ఈయన ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ఎక్కడా తగ్గకుండా ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి చిరంజీవి కోసం ఎంతోమంది అభిమానులు వాళ్ళ ప్రాణాలను సైతం వదిలేయడానికి రెడీగా ఉన్నారు. నిజానికి అంతటి అభిమానాన్ని సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ జనరేషన్ లో చూసుకున్న హీరోలు అందరికీ మంచి ఫాలోయింగ్ అయితే ఏర్పడుతుంది. కానీ చిరంజీవికి ఏర్పడిన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయన ఏది చెప్తే తన అభిమానులు అది చేసేవారు. అలాంటి ఒక స్టార్ డమ్ నుంచి సేవ కార్యక్రమాలను కూడా చేస్తూ తన అభిమానులను కూడా మోటివేట్ చేస్తూ వాళ్లు కూడా జనానికి సేవ చేసే విధంగా చేసిన ఏకైక హీరో కూడా చిరంజీవి గారే కావడం విశేషం…
ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి దర్శకుడు చిరంజీవితో ఒక్క సినిమా అయిన చేయాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంతమందితో సినిమాలు చేసిన కూడా చిరంజీవితో సినిమా చేయడం లో ఉన్న కిక్కు వేరనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరూ ఒకప్పుడు చిరంజీవి అభిమానులుగా ఉన్నవారే కావడం విశేషం…అందువల్ల చిరంజీవిని డైరెక్షన్ చేయాడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక ఇద్దరు డైరెక్టర్లు మాత్రం చిరంజీవితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదు.
వాళ్ళు ఎవరు అంటే స్టార్ రైటర్ గా గుర్తింపు పొందిన యండమూరి వీరేంద్రనాథ్ చిరంజీవితో ‘స్టువర్టుపురం పోలీస్ స్టేషన్’ అనే సినిమాని స్టార్ట్ చేశాడు. మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ సినిమాని తను హ్యాండిల్ చేయలేనని చిరంజీవి చరిష్మా ని ఎలా చూపించాలో తనకు అర్థం కావడం లేదని సినిమా నుంచి తప్పుకున్నాడు. దాంతో చిరంజీవి ఆ సినిమా మొత్తాన్ని పూర్తి చేసి రిలీజ్ చేశాడు. సినిమా డిజాస్టర్ గా మారినప్పటికీ చిరంజీవి మాత్రం యండమూరి ని ఎక్కడ దూషించలేదు. ఇక ఇతనితో పాటుగా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రామ్ గోపాల్ వర్మ కూడా చిరంజీవితో సినిమాని స్టార్ట్ చేసి మధ్యలోనే వదిలేసి ముంబై వెళ్ళిపోయాడు.
కారణం ఏంటి అంటే చిరంజీవితో ఎలాంటి సినిమా చేయాలో తనకు అర్థం కావడం లేదని తను అనుకున్న సినిమా చిరంజీవితో చేస్తే ఆ సినిమా ఆడదనే ఉద్దేశ్యం తోనే ఆయన చిరంజీవి సినిమాని స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసినట్టుగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక మొత్తానికైతే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రామ్ గోపాల్ వర్మ సైతం చిరంజీవి తో సినిమా స్టార్ట్ చేసి ఆయన ఇమేజ్ మ్యాచ్ అయ్యే సినిమా చేయలేనని భయంతో చేతులెత్తేయడం అనేది అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది…