Heroine
Heroine : సెలెబ్రిటీలు కనిపించినప్పుడు వాళ్ళతో కలిసి సెల్ఫీలు దిగాలని, వాళ్ళ నుండి ఒక ఆటోగ్రాఫ్ పొందాలని అభిమానులు కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. సెలెబ్రిటీలు కూడా తమకు ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ అభిమానులకు సమయం కేటాయించి నవ్వుతూ సెల్ఫీలు ఇవ్వడం మనమంతా చూసాము. ముఖ్యంగా హీరోయిన్లు జిమ్ లో వర్కౌట్స్ చేసి బయటకి వస్తున్నప్పుడు అభిమానులు ఫోటోగ్రాఫర్స్ తో ఆతృతగా ఎదురు చూసి, వాళ్ళతో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నం చేస్తుంటారు. రీసెంట్ గా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే(Poonam Pandey) కి ఒక వింత సంఘటన ఎదురైంది. ఆమె ఫుట్ పాత్ మీద నిల్చొని తన స్టాఫ్ తో ఎదో అంశంపై సీరియస్ గా చర్చిస్తున్న సమయంలో ఒక అభిమాని ఆమెవైపు దూసుకొచ్చేసాడు. దాంతో హీరోయిన్ భయానికి గురైంది. సరే..పోనిలే పాపం అని అతనికి సెల్ఫీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత అతను ప్రవర్తించిన తీరు హీరోయిన్ ని పరుగులు పెట్టేలా చేసింది.
సెల్ఫీ తీసుకున్న వెంటనే ఆ కుర్రాడు పూనమ్ పాండే కి ముద్దు పెట్టే ప్రయత్నం చేసాడు. దీంతో ఆమె కేకలు పెట్టి అక్కడి నుండి పరుగులు తీసింది. ఆ తర్వాత అతని వైపు చూస్తూ అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు అంటూ హిందీ లో తిట్టడం మొదలు పెట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. కొంతమంది నెటిజెన్స్ హీరోయిన్ పట్ల అలా ప్రవర్తించినందుకు మండిపడుతున్నారు. మరికొంత మంది మాత్రం ఇది కేవలం పూనమ్ పాండే పబ్లిసిటీ కోసం చేసిన స్టెంట్ అని, ఆమెకు ఇదేమి కొత్త కాదని, గతంలో ఇలాంటి పిచ్చి పనులు చాలానే చేసింది. నెటిజెన్స్ ఆమె చేష్టలపై ఎన్నోసార్లు తీవ్రమైన అసహనం కూడా వ్యక్తం చేసారు. పెద్ద ఎత్తున ఆమెపై ట్రోలింగ్స్ కూడా జరిగింది.
గత ఏడాది ఈమె చనిపోయినట్టు అందరినీ నమ్మించింది. పాపం చిన్న వయస్సులోనే చనిపోయిందని అందరూ ఆమె పై సానుభూతి చూపిస్తూ రెస్ట్ ఇన్ పీస్ పోస్టులు వేశారు. కానీ మరుసటి రోజు అలాంటిదేమి లేదని, కేవలం ప్రాంక్ చేశాను అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఒక్కసారి సోషల్ మీడియా భగ్గుమంది. పూనమ్ పాండే లాంటి వరస్ట్ సెలబ్రిటీ ని మా జీవితం లో చూడలేదంటూ కామెంట్స్ చేసారు. అప్పటి నుండి పూనమ్ పాండే ఏమి చెప్పినా నెటిజెన్స్ నమ్మడం లేదు. నిన్న వైరల్ అయినా వీడియో కూడా ప్రాంక్ అయ్యి ఉంటుంది అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ఈ వీడియో మాత్రం చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపించింది. పూనమ్ పాండే బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది కానీ, ఆమెకు సినిమాలకంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. ఇంస్టాగ్రామ్ లో ఈమె అప్లోడ్ చేసే ఫోటోలకు మిలియన్ల సంఖ్యలో లైక్స్ వస్తుంటాయి.