Oreo Biscuit Viral Video : చాలా మంది పిల్లలు ఓరియో బిస్కెట్ లను ఇష్టపడతారు. ఇక ఉదయం లేదా సాయంత్రం స్నాక్ రూపంలో వీటిని తింటారు. ఇవి తినడానికి రుచికరంగా ఉంటాయి. రెండు ఫ్లేవర్లలో అందుబాటులో ఉంటాయి ఈ ఓరియో బిస్కెట్లు. ఒకటి మిల్క్ ఫ్లేవర్ లో లభిస్తుంది. మరొకటి చాక్లెట్ ఫ్లేవర్. గతంలో ఈ బిస్కెట్ యాడ్ ఏ రేంజ్ లో వైరల్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రీసెంట్ గా ఓరియో బిస్కెట్లకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతలా వైరల్ అవడానికి అందులో ఏముందో ఓ సారి చూసేద్దామా?
ఈ వీడియోలో ఓరియో బిస్కెట్లను ఎక్కువసేపు కాల్చారు. అయినా సరే అవి కాలిపోదు.. దాదాపు 30 సెకండ్ల పాటు కాల్చారు. అయినా సరే ఈ ఓరియో బిస్కెట్ మాత్రం కాలలేదు. మరి ఇలాంటి బిస్కెట్లు తినటం మంచిదేనా? లేదా అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అదే సందేహంతో ఎంతో మంది సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వాటి తయారీకి ఎలాంటి పదార్థాలు ఉపయోగిస్తారు. ఈ రేంజ్ లో స్ట్రాంగ్ గా ఉన్నాయి అంటూ షాక్ అవుతున్నారు. ఒక చెక్క ఫ్రేమ్ మీద ఓరియో బిస్కెట్లు పెట్టి కాలస్తే చెక్క ఫ్రేమ్ కాలింది కానీ బిస్కెట్ మాత్రం అలాగే ఉంది. అందుకే ఈ వీడియో తెగ వైరల్ గా అవుతుంది. పిల్లలు ఇష్టంగా తినే ఈ ఓరియో బిస్కెట్ కాలకపోవడానికి కారణం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
ఇక ఈ బిస్కెట్లను పాలతో తయారుచేస్తారు. మంట కంటే పాలే ఎక్కువ బలంగా ఉంటాయా? అంటూ ఎక్స్ వేధికగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నియాసిన్, ఐరన్, మోనో మోనిట్రేట్ తియమిన్, చక్కెర, అన్ బ్లీచ్ చేసిన పిండి అంటే గోధుమ పిండి, రైబోఫ్లెవిన్, కార్న్ ఆయిల్, సోయాబీన్ కోకోవా, కేనోలో ఆయిల్ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. అంతేకాదు కార్న్ సిరప్, బేకింగ్ సోడా, ఉప్పు, సోయా లేసితిన్, చాకోలెట్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ లను కూడా కలుపుతారు. ఇదెలా ఉంటే మొత్తం మీద ఓరియో బిస్కెట్ కు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. కొంతమంది మా పిల్లలకు ఈ బిస్కెట్లు పెట్టం అంటున్నారు.
సోషల్ మీడియాలో పెట్టే చాలా పోస్టులు అయినా నెట్టింటా వైరల్ అవడం కామన్ గా చూస్తుంటాం. కొన్ని వీడియోలను ఆసక్తిగా చూస్తారు నెటిజన్లు. జంతువులకు సంబంధించిన కొన్ని పోస్టులు మరీ ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఇక పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతాయి. ఇలా ట్రెండ్ అయ్యే చాలా వీడియోలు కూడా అవగాహన కల్పించే వీడియోలే. పాముల వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతాయి. ఏ కొత్త ప్రయోగాలు చేసినా అవి నెట్టింట ట్రెండింగ్‌లో నిలుస్తాయి. అదే తరహా ఈ ప్రయోగం కూడా వైరల్ అవుతుంది.
I saw this on . Tested the theory with my assistant’s.
You cannot burn an Oreo.
My kids are no longer eating them. Ever. pic.twitter.com/47cc7vGpm6
— Jason Mac (@JasonMac2022) December 21, 2024