Anee Master: డాన్స్ చేస్తూ ప్రమాదానికి గురైన అనీ మాస్టర్… అక్కడ గాయం, వీడియో వైరల్!

రచ్చ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రచ్చ మూవీలోని ''దిల్లకు దిల్లకు'' సాంగ్ కి ఫస్ట్ టైం కొరియోగ్రాఫర్ గా చేసింది. ఇప్పటి వరకు అనీ మాస్టర్ 350 చిత్రాలకు పని చేసినట్లు సమాచారం.

Written By: S Reddy, Updated On : April 23, 2024 3:28 pm

Anee Master Injured During Doing Dance

Follow us on

Anee Master: అనీ మాస్టర్ ప్రమాదానికి గురయ్యారు. ఆమె డాన్స్ చేస్తూ కాలు జారి క్రింద పడ్డారు. దాంతో అనీ మాస్టర్ ముఖానికి గాయమైంది. అనీ మాస్టర్ అసలు పేరు అనిత లంబ. డార్జిలింగ్ కి చెందిన అనిత లంబ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. ఈమె తండ్రి ఆర్మీ ఆఫీసర్ అని సమాచారం. అయితే అనీ మాస్టర్ బాల్యంలోనే తండ్రి కన్నుమూశాడు. చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి డాన్స్ నేర్చుకుంది. 13 ఏళ్ల ప్రాయం నుండే డాన్స్ రియాలిటీ షోలలో కంటెస్ట్ చేయడం ప్రారంభించింది.

జెమినీ టీవీలో ప్రసారమైన డాన్స్ బేబీ డాన్స్ షోలో అనీ మాస్టర్ పార్టిసిపేట్ చేసింది. ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. మాధురి దీక్షిత్, మధుబాల వంటి హీరోయిన్స్ అనీ మాస్టర్ కి స్ఫూర్తి అట. వారిని చూసి డాన్స్ నేర్చుకుందట. చిరంజీవి చిత్రానికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా మొదటి ఛాన్స్ వచ్చింది.

రచ్చ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రచ్చ మూవీలోని ”దిల్లకు దిల్లకు” సాంగ్ కి ఫస్ట్ టైం కొరియోగ్రాఫర్ గా చేసింది. ఇప్పటి వరకు అనీ మాస్టర్ 350 చిత్రాలకు పని చేసినట్లు సమాచారం. అలాగే ఆమె బిగ్ బాస్ తెలుగు 5లో కంటెస్ట్ చేసింది. అనీ మాస్టర్ హౌస్లో బాగానే రాణించింది. ఆమెకు 11 వారాలు హౌస్లో ఉన్నారు. మరో కంటెస్టెంట్ కాజల్ తో అనీ మాస్టర్ కి పడేది కాదు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితారకు అనీ మాస్టర్ డాన్స్ నేర్పుతున్నట్లు సమాచారం. సితార-అనీ మాస్టర్ తరచుగా రీల్స్ చేస్తూ కనిపిస్తారు. ఇక సోషల్ మీడియాలో అనీ మాస్టర్ చాలా యాక్టీవ్. తరచుగా డాన్స్ వీడియోలు చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆమె ప్రమాదానికి గురైంది. వర్షానికి తడిసిన మేడ మీద డాన్స్ చేస్తుండగా ఆమె కాలు జారింది. దాంతో ముఖానికి దెబ్బ తగిలింది. దానితో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అనీ మాస్టర్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం.