Viral News : చేసే వంట విషయంలో ఆడవాళ్లకు ఒక స్పష్టత ఉంటుంది. అన్నం వండడానికి ఎన్ని బియ్యం వాడాలి.. బియ్యం ఉడకాలంటే ఎంత పరిమాణంలో నీళ్లు వినియోగించాలి.. మంట ఏ స్థాయిలో ఉండాలి.. ఇలా ప్రతి విషయంలో ఆడవాళ్లు లెక్కలేసుకుంటారు. కూర వండే విషయంలోనూ ఇదే పద్ధతిని పాటిస్తారు. కూరగాయలలో పుచ్చులు ఉన్నా.. మరకలు ఉన్నా ఏమాత్రం సహించరు. కూరగాయలు కొనే విషయంలోనూ బేరాలు ఆడుతుంటారు. నాణ్యమైన వాటిని మాత్రమే కొనుగోలు చేస్తారు. ఇందులో ఎవరు ఎన్ని చెప్పినా వినిపించుకోరు. ఒకవేళ చెబితే మీకేం తెలుసంటూ ఎదురు ప్రశ్నిస్తారు. నోరు మూసుకొని గమ్మున ఉండండి అంటూ హెచ్చరిస్తారు. అందువల్లే కిచెన్ లోకి పొరపాటున మగవాళ్ళు అడుగుపెట్టరు. పెట్టింది తింటారు. మూసుకొని కూర్చుంటారు. ఇందులో ఎంతటి మగవాళ్ళయినా సరే జస్ట్ నిశ్శబ్దంగా ఉండాల్సిందే. అయితే సోషల్ మీడియాలో ఓ గృహిణి తన భర్తకు కూరగాయలు కొనే విషయంలో సూచించిన జాగ్రత్తలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
మాజీ ఐఎఫ్ఎస్ అధికారి మోహన్ పర్గేయన్ ను కూరగాయలు తీసుకురావాలని ఆయన సతీమణి ఆదేశించింది. భార్య చెప్పింది కాబట్టి కూరగాయలు కొనుగోలు చేయడానికి ఆయన మార్కెట్ కి వెళ్ళాడు. ఈలోగా ఆయన వాట్సప్ కి ఒక మెసేజ్ వచ్చింది. ఎవరు పంపించారోనని చూస్తుండగా.. తన భార్య నెంబర్ నుంచి మెసేజ్ రావడంతో ఏమై ఉంటుందోనని ఆయన జాగ్రత్తగా పరిశీలించారు. అందులో కూరగాయల సంబంధించిన నిబంధనలు కనిపించాయి. ” టమాటాలకు పుచ్చులు ఉండకూడదు. కాయలు దోరగా ఉండాలి. బెండకాయలు మరీ లేతవి వద్దు. ఒక మాదిరివి మాత్రమే కావాలి. పాలు కూడా టోన్డ్ వి కావాలి. పన్నీర్ తాజాగా ఉండాలి. పాలక్ ముదురుగా ఉండకూడదని” ఆమె పేర్కొంది. ఈ వివరాలను మొత్తం ఒక పేపర్ మీద రాసి.. మోహన్ కు వాట్సప్ చేసింది. తన భార్య అలా నిబంధనలను సూచించడాన్ని చూసి మోహన్ ఆశ్చర్యపోయాడు. వెంటనే తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు. “నేను కూరగాయలు కొనేందుకు మార్కెట్ కు వెళ్తే.. నా భార్య ఎలాంటి పని చేసిందో మీరే చూడండి.. మీలో ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురయిందా” అంటూ మోహన్ ట్విట్టర్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో ఈ ట్విట్ వైరల్ గా మారింది. మోహన్ చేసిన ఈ ట్వీట్ పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. కూరగాయలు కొనే విషయంలో మీ భార్య ముందు చూపు బాగుందని కొనియాడుతున్నారు. మరికొందరు ఐఎఫ్ఎస్ అధికారికి కూరగాయలు ఇలాంటివి కొనాలో తెలియదా అంటూ కొంటెగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
While going for market for vegetables my wife shared with me this stating that you can use this as a guide pic.twitter.com/aJv40GC6Vj
— Mohan Pargaien IFS (@pargaien) September 13, 2024