Mahesh Babu: సినీ రంగంలో మాత్రమే కాదు, వ్యాపార రంగం లో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన మార్కుని ఏర్పాటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో మహేష్ బాబు కి అనేకమైన వ్యాపారాలు ఉన్నాయి. వాటిల్లో ఆయనకీ మంచి లాభాలను తెచ్చిపెట్టిన వ్యాపారం ఏదైనా ఉందా అంటే అది AMB సినిమాస్ మల్టీప్లెక్స్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఏషియన్ ఫిలిమ్స్ సంస్థ అధినేత సునీల్ నారంగ్ తో కలిసి స్థాపించిన ఈ థియేటర్ హైదరాబాద్ లో పెద్ద హిట్ అయ్యింది. విదేశాల్లో వాడే అత్యాధునిక టెక్నాలజీ ని ఈ థియేటర్ కోసం వాడాడు మహేష్ బాబు. చూసేందుకు చాలా స్టైలిష్ గా, లావిష్ గా ఆ థియేటర్ ఉంటుంది. హైదరాబాద్ లో విడుదలయ్యే సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా ఈ థియేటర్ లో హౌస్ ఫుల్స్ పడుతుంటాయి. అలాంటి బ్రాండ్ ఇమేజి ఉన్న థియేటర్ ఇది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా GEOIQ సంస్థ దేశం లో ప్రేక్షకులు అత్యధికంగా వీక్షించే మల్టీప్లెక్స్ థియేటర్స్ లిస్ట్ ని విడుదల చేసింది.
వీటిలో హైదరాబాద్ కి చెందిన శరత్ సిటీ కాపిటల్ మాల్ జాతీయ స్థాయిలో 9 వ స్థానంలో నిలబడగా, మహేష్ కి సంబంధించిన AMB మాల్ 8 వ స్థానం లో నిల్చింది. హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు, సినీ లవర్స్ AMB మాల్ ని సందర్శిస్తున్నారని, హైదరాబాద్ లో ఈ మాల్ కి ఉన్న బ్రాండ్ ఇమేజి ఏ మాల్ కి లేదని ఈ సందర్భంగా GEOIQ నివేదిక అందించింది. ఈ థియేటర్ లో ప్రస్తుతం కల్కి చిత్రానికి అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన చిత్రం గా రికార్డు ఉంది. కేవలం కొత్త సినిమాలు మాత్రమే కాకుండా, రీ రిలీజ్ చిత్రాలు కూడా అత్యధికంగా ఈ థియేటర్ లో విడుదల అవుతుంటాయి. సిటీ నలుమూలల్లో ఉండేవారు కూడా ఈ థియేటర్ లోనే రీ రిలీజ్ సినిమాలను చూసేందుకు అమితాసక్తిని చూపిస్తుంటారు. అయితే AMB సినిమాస్ కేవలం ఒక్క హైదరాబాద్ కి మాత్రమే పరిమితం అయ్యేలా లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలలో ఈ థియేటర్స్ గ్రూప్ ఉండే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ లోని వైజాగ్ ప్రాంతం లో AMB సినిమాస్ ని స్థాపించడానికి మహేష్ బాబు సన్నాహాలు చేస్తున్నాడు.
ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ప్రారంభంలో ‘గుంటూరు కారం’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు, అతి త్వరలోనే రాజమౌళి తో ఒక సినిమా ప్రారంభించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ఈ సినిమా వర్క్ షాప్ కోసం తనని తానూ కొత్తగా మలుచుకుంటున్నాడు. ఆయన లుక్ కూడా చాలా కొత్తగా, ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఉండబోతుందని సమాచారం, ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.