Homeలైఫ్ స్టైల్Man Brought The Monkey Life: కోతికి ప్రాణం పోసిన వ్యక్తి.. మిగతా కోతులు ఏం...

Man Brought The Monkey Life: కోతికి ప్రాణం పోసిన వ్యక్తి.. మిగతా కోతులు ఏం చేశాయో తెలుసా? వీడియో వైరల్..

Man Brought the monkey to life: చేతిలో ఏదైనా పండు ఉంచుకొని హనుమాన్ ఆలయానికి వెళితే కోతులు చుట్టుముడుతూ ఉంటాయి. అయితే ప్రస్తుత కాలంలో కోతులకు ఆహారం కరువు కావడంతో గ్రామాల్లోకి వచ్చి అలజడిని సృష్టిస్తున్నాయి. ఇళ్ల పైన పెంకులను పగలకొడుతూ.. పంట లను ధ్వంసం చేస్తూ మనుషులకు చికాకు తెప్పిస్తున్నాయి అయినా కోతిని దేవుడు స్వరూపంగా భావించి అవి చేసే పనులను ఓర్చుకుంటున్నారు. ఒక్కోసారి ఏదైనా కోతిని దాడి చేయడం వలన దానికి సంబంధించిన పదుల సంఖ్యలో కోతులు వచ్చి ఆ వ్యక్తిపై దాడి చేసిన సంఘటనలు చూశాం. కోతులు తమపై దాడి చేస్తే ఎంత ప్రతీకారం తీర్చుకుంటాయో తమపై ప్రేమను చూపిస్తే అంతే అక్కున చేర్చుకుంటాయి.. అందుకు నిదర్శనమే ఈ వీడియో.. ఆ వివరాల్లోకి వెళితే..
ఈమధ్య కాలంలో కోతుల బెడద తీవ్రమైంది. అవి గ్రామాల్లో పదులకంటే ఎక్కువ సంఖ్యలో వచ్చి మనుషులపై దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలపై దాడి చేసిన సంఘటనలో కొందరు మరణించారు కూడా. అయినా కోతలంటే మనుషులకు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. అవి ఎంత దాడి చేసినా.. వాటికి ఏదైనా అపాయం జరిగితే వెంటనే చలించి పోయేవారు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కోతి మరణిస్తే వాటినీ మనసుల్లాగే ట్రీట్ చేస్తూ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
తాజాగా ఓ కోతికి ఆపద రావడంతో ఓ వ్యక్తి వెంటనే ఆదుకున్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ ప్రాంతంలో కోతి విద్యుత్ షాక్ కు గురై కిందపడిపోయింది. దీంతో అక్కడున్న కోతులు దాన్ని చుట్టుముట్టాయి. విద్యుత్ షాక్ కు గురైన కోతి కి ఎటువంటి చలనం లేకపోవడంతో అది మరణించిందని అనుకున్నాయి. అయితే అటువైపు వెళుతున్న ఫోటోగ్రాఫర్ వెంకట్ అనే వ్యక్తి కోతి పరిస్థితిని చూశాడు. దీంతో ఆ కోతిని వెంటనే  సమీప పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. చివరికి ఆ కోతికి చలనం రావడంతో దానిని కోతుల వద్ద వదిలేశాడు. అయితే అయితే తమ తోటి కోతికి ప్రాణం పోసిన వ్యక్తి వెంకన్నకు కృతజ్ఞత చెప్పేందుకు మిగతా కోతులు ఆయనను చుట్టూ ముట్టాయి. ఆయన ఎటు వెళ్తే అటు వెళ్తూ సందడి చేశాయి.
సాధారణంగా ఎవరికైనా తమపై దాడి చేస్తే వారిపై పగ తీర్చుకోవాలని ఉంటుంది. ఇటీవల కాలంలో కోతుల బెడద తీవ్రమవుతోంది. ఇలాంటి సమయంలో కోతుల దాడి విషయాన్ని పట్టించుకోకుండా వాటికి ఆపద వస్తే సాయం చేయడానికి ముందుకు రావడం పై పలువురు ప్రశంసిస్తున్నారు. అయితే కోతులు సైతం తమ తోటి వారిని ఆదుకోవడంతో అవి చూపించే ప్రేమను చూసి ఆసక్తి కనబరిస్తున్నారు. జంతువుల్లో విశ్వాసం ఎక్కువగా ఉంటుందని తమను ఎవరైనా ఆదుకుంటే వారి వెంటే ఉండడానికి అవి కృషి చేస్తాయని కొనియాడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై చాలా మంది ఆసక్తికరమైన కామెంట్ చేస్తున్నారు.
S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular