Maha TV office attack: అది హైదరాబాద్.. మహా టీవీ ఆఫీస్.. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత భారత రాష్ట్ర సమితి నాయకులు కర్రలు, రాళ్లతో వచ్చారు. నానా మాటలు మాట్లాడుతూ రాళ్లతో ఆఫీస్ అద్దాలు ధ్వంసం చేశారు. కర్రలతో బీభత్సం సృష్టించారు.. సెక్యూరిటీ గార్డులు అడ్డుకుంటున్నప్పటికీ వారు ఏమాత్రం వెనకడుగు వేయలేదు.
మహా న్యూస్ లో తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కథనాలు ప్రసారమయ్యాయి. ఈ కథనాలు కేటీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి నాయకులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం 11 గంటల దాటిన తర్వాత దాడులకు పాల్పడ్డారు. కార్యాలయానికి సంబంధించిన అద్దాలు పగలగొట్టారు. కార్యాలయం ముందున్న కార్లను ధ్వంసం చేశారు. రాళ్లతో ఆఫీసు లో ఉన్న పూల మొక్కలను ధ్వంసం చేశారు. ఇతర ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. దీంతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వెనకడుగు వేయలేదు. పైగా కేటీఆర్ మీద వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తారా అంటూ మండిపడ్డారు. ఎన్ని గుండెలు మీకు అంటూ ప్రశ్నించారు.
Also Read: హౌలా.. లుచ్చా.. వాడు పీకేది లేదు.. ఇవేం మాటలు కేటీఆర్ సార్.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం నియమించిన అధికారుల బృందం విచారణ సాగిస్తోంది. విచారణకు రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా, మీడియా అధినేతలు, ఇతర ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. వారి వాంగ్మూలాలను అధికారులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహా టీవీలో కొద్దిరోజులుగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వార్తలు ప్రసారమవుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా కేటీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నాయని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ న్యూస్ ఛానల్ లో పెడుతున్న శీర్షికలు అత్యంత దారుణంగా ఉన్నాయని.. జుగుప్సాకరంగా కనిపిస్తున్నాయని మండిపడుతున్నారు.. మహా న్యూస్ కేటీఆర్ కు వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తున్న నేపథ్యంలో.. కొద్దిరోజులుగా గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. అంతేకాదు అమెరికా, దేశాల్లో ఉంటున్న కొంతమంది గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా వారియర్స్ నేరుగానే పిలుపునిస్తున్నారు. దాడులు మీరు చేస్తారా? మేము చేయాలా అంటూ? రెచ్చగొడుతున్నారు.. దీంతో స్థానికంగా ఉన్న గులాబీ పార్టీ నాయకులు ఈరోజు మహా న్యూస్ కార్యాలయం ఎదుట పెద్ద విధ్వంసం సృష్టించారు. మొత్తానికి మహా న్యూస్ యాజమాన్యానికి హెచ్చరికలు పంపారు. గులాబీ పార్టీ నాయకుల దాడుల నేపథ్యంలో మహా న్యూస్ యాజమాన్యం తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సిసి ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. దాడులకు పాల్పడిన వారిని పోలీసులు గుర్తించారని.. వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.. అయితే ఈ దాడులకు గత కొద్దిరోజులుగానే గులాబీ పార్టీ కార్యకర్తలు ప్రణాళికల రూపొందించాలని మహా న్యూస్ యాజమాన్యం ఆరోపిస్తోంది.
బ్రేకింగ్ న్యూస్
మహా టీవీ ఆఫీస్ పై BRS కార్యకర్తల దాడి
ఆఫీస్ అద్దాలు ధ్వంసం
ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీయార్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం
కార్లు ధ్వంసం .. ఇంకా కొనసాగుతున్న దాడి
స్టూడియోను ధ్వంసం చేసిన కార్యకర్తలు pic.twitter.com/HxQtuKOi7Q
— Telugu Scribe (@TeluguScribe) June 28, 2025