WhatsApp money earning: మొబైల్లో ఉన్న ప్రతి ఒకరు వాట్సాప్ ను వినియోగిస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో ప్రతి అవసరానికి వాట్సాప్ ప్రధాన వాహకంగా నిలుస్తుంది. ఒకప్పుడు కేవలం మెసేజ్లు మాత్రమే పంపించుకునే ఈ యాప్.. ఇప్పుడు ఫోటోలు, వీడియోలు, ఇతర విలువైన డాక్యుమెంట్లను కూడా పంపించుకునే సౌకర్యాన్ని కల్పించింది. అలాగే డబ్బులు సెండ్ చేసుకుని ఆప్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇలా వినియోగదారులకు అనుగుణంగా రోజురోజుకు ఈ యాప్ అప్డేట్ అవుతూ వస్తుంది. అయితే తాజాగా వినియోగదారులు డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. ఇప్పటివరకు యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ వంటి యాప్స్ ద్వారా మాత్రమే డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా మనీ ఎర్నింగ్ సౌకర్యం ఉండే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
వాట్సాప్ మాతృ సంస్థ అయినా మెటా తాజాగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతుంది.. ఈ ఫీచర్లు వినియోగదారుల మనీ ఎర్నింగ్ కోసం ఉపయోగపడే అవకాశం ఉంది. వాట్సాప్ లో స్టేటస్ లో ప్రత్యేకంగా కొన్ని పెయిడ్ చానల్స్ ను అందుబాటులో ఉంచానుంది. వీటి ద్వారా వినియోగదారుడు కోరుకుంటే డబ్బులు సంపాదించుకోవచ్చు. అయితే చాలామంది వినియోగదారుల భద్రతకు ఇది భంగం కలిగిస్తుందని ఆందోళన చెందుతున్నారు. కానీ వినియోగదారుల కు సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని.. చానల్స్ మాత్రమే నోటిఫికేషన్ ఇస్తాయని.. వీటిని వినియోగదారుడు కోరుకుంటే మాత్రమే అప్డేట్ అయ్యే అవకాశం ఉందని తెలుపుతోంది.
Also Read: ఇప్పుడు వాట్సాప్ లో ఉచిత వైద్య సలహాలు.. ఎలా పొందాలంటే?
అంతేకాకుండా వీటిని అవసరం లేదనుకుంటే సెట్టింగ్స్లో ఆఫ్ చేసుకోవచ్చని కూడా పేర్కొంది. అయితే వినియోగదారులు దీనికి డబ్బు చెల్లించాల్సి వస్తే మాత్రం దూరంగా ఉండవచ్చని తెలిపింది. వాట్సాప్ కు వినియోగదారులు పెరుగుతున్న సమయంలో మెటా సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనివార్యమని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం ప్రైవసీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలుపుతున్నారు.
అయితే ఈ ఫీచర్ల విషయంలో కేవలం చర్చలు మాత్రమే జరుగుతున్నాయని.. ఇంకా ఫైనల్ గా నిర్ణయం తీసుకోవాలని తెలుస్తోంది. దీనిపై నిపుణులను పూర్తిగా సంప్రదించిన తర్వాతే అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగతా చానల్స్ లో వినియోగదారులకు సంబంధించిన ఎటువంటి ప్రైవసీ ఇన్ఫర్మేషన్ కల్పించదు. కానీ వాట్సాప్ లో మాత్రం పర్సనల్ ఫోన్ నెంబర్లు ఉంటాయి. వీటితో లింక్ అయ్యి అనేక నెంబర్లు ఉంటాయి. దీంతో కొన్ని సైబర్ నేరగాళ్లకు సంబంధించిన ఛానల్ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని కొందరు ఆందోళన చెందుతున్నారు. అందువల్ల దీనిపై పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వాట్సప్ సంస్థ ప్రజలను తెలుపుతున్నారు.
Also Read: ఈ మూడు ఆప్షన్లు క్రేజీగా ఉంటాయి.. వెంటనే తెలుసుకోండి..WhatsApp Monetization Feature
కానీ ఇది న్యాయపూర్వకంగా ఉంటే వాట్సాప్ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందని మరికొందరు వాదిస్తున్నారు. పెయిడ్ చానల్స్ ను ఉపయోగించే సమయంలో వినియోగదారులకు సంబంధించి కేవలం లొకేషన్ మాత్రమే అడుగుతుందని.. ఇతర ఎలాంటి డేటా కోరదని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఈ ఫీచర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చూడాలి..