https://oktelugu.com/

Annamalai DMK Files : తమిళనాడును షేక్ చేస్తోన్న ‘అన్నామలై’ ‘డీఎంకే ఫైల్స్’ కథేంటి?

Annamalai DMK Files: అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచయో లేదో అప్పుడే స్టాలిన్ ప్రభుత్వానికి బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చుక్కలు చూపిస్తున్నాడు. రొటీన్ రాజకీయాలు కాకుండా, పెరియార్ సిద్ధాంతాలు వల్లె వేయకుండా తమిళనాడు లో కొత్త శకాన్ని ప్రారంభించేందుకు అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే అధికార డిఎంకె అవినీతిని ‘డీఎంకే ఫైల్స్’ పేరుతో బట్టబయలు చేస్తున్నాడు. ఏ ప్రజా ప్రతినిధి ఎన్ని డబ్బులు మింగాడో, ఏ పథకంలో ఎంత అవినీతికి పాల్పడ్డాడో లెక్కలతో సహా […]

Written By:
  • NARESH
  • , Updated On : April 15, 2023 / 10:44 PM IST
    Follow us on

    Annamalai DMK Files: అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచయో లేదో అప్పుడే స్టాలిన్ ప్రభుత్వానికి బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చుక్కలు చూపిస్తున్నాడు. రొటీన్ రాజకీయాలు కాకుండా, పెరియార్ సిద్ధాంతాలు వల్లె వేయకుండా తమిళనాడు లో కొత్త శకాన్ని ప్రారంభించేందుకు అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే అధికార డిఎంకె అవినీతిని ‘డీఎంకే ఫైల్స్’ పేరుతో బట్టబయలు చేస్తున్నాడు. ఏ ప్రజా ప్రతినిధి ఎన్ని డబ్బులు మింగాడో, ఏ పథకంలో ఎంత అవినీతికి పాల్పడ్డాడో లెక్కలతో సహా వివరించి చూపుతున్నాడు. బహుశా తమిళనాడు చరిత్రలోనే ఈ స్థాయి సాహసానికి ఏ పార్టీ పూనుకోలేదు. అంతటి జయలలిత, కరుణానిధి హయాంలోనూ ఢీ అంటే ఢీ అనుకునే రాజకీయాలు సాగినప్పటికీ ఈ స్థాయిలో తూర్పార పట్టుకోలేదు.

    ద్రావిడ మున్నేట్ర కజగం ఇప్పుడు తమిళనాడులో అధికారంలో ఉంది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు.. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పలు మార్పులకు శ్రీకారం చుట్టినప్పటికీ అవన్నీ కూడా తమ పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు చేసినవే అని తెలుస్తోంది.. నీట్ ఆందోళనల దగ్గర నుంచి మొన్నటి శ్రీరామనవమి శోభాయాత్ర వరకు ప్రతి విషయంలోనూ స్టాలిన్ ప్రభుత్వం ఓ వర్గం మనోభావాలను దెబ్బతీస్తోంది. అంతేకాదు పెరియార్ సిద్ధాంతాల పేరుతో అక్కడి తమిళ హిందువులను ఇబ్బంది పెడుతోంది.. మరోవైపు హిందీ పై రాద్ధాంతం చేస్తూ భారతీయ జనతా పార్టీ పై విషం కక్కుతోంది. మొన్నటికి మొన్న దహి అనే పేరు మీద ఎంత రాద్ధాంతం చేసిందో తెలిసిందే.. ఈ వివాదాలు మొత్తం తమిళ ప్రజల మనోభావాలు కాపాడేందుకు తెరపైకి తీసుకొచ్చినవి కావు. స్టాలిన్ ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలను డైవర్ట్ చేసేందుకు వ్యూహాత్మకంగా అమలు చేసినవి. పైగా డీఎంకే చేతిలో సన్ టీవీ, మురసోలి అనే పేపర్ ఉండటంతో ప్రజల దృష్టి సులువుగా మళ్ళిస్తోంది.

    సరిగ్గా దీనినే ఆసరాగా తీసుకున్న తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అధికార పార్టీ నేతల అవినీతిని బయటపెడుతున్నాడు. డీఎంకే ఫైల్స్ పేరుతో ఒక్కొక్క డీఎంకే నేత ఎన్ని కోట్లు ప్రజల సొమ్ము దిగమింగారో లెక్కలతో సహా చెబుతున్నాడు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. ప్రస్తుతం ట్విట్టర్లో డీఎంకే ఫైల్స్ ట్రెండింగ్ గా నిలుస్తోంది. స్టాలిన్ సోదరి కనిమొలి ఎన్నికల సమయంలో తన ఆస్తులను 30 కోట్లుగా పేర్కొంది. కానీ ఆమెకు కలయింగర్ టీవీలో ఆమెకు ఎనిమిది వందల కోట్ల విలువైన వాటాలు ఉన్నాయి. కేవలం ఏళ్ల వ్యవధిలోనే ఇంత సంపాదన ఎలా సాధ్యమైంది అనేది అన్నామలై ప్రధాన ప్రశ్న.

    ద్రవిడవాదం పేరుతో డీఎంకే చేస్తున్న మోసం.. తమిళనాట అవినీతి తాండవాన్ని బయటకు తీస్తున్న అన్నామలైపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు