Varun Tej Ghani Movie: కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘గని’. కాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు అయింది. ‘గని’ టీజర్ మార్చి 17న ఉదయం 10.30 కు విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నారు.
నిజానికి తన కెరీర్ లోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా చేస్తున్నాడు. మరి వరుణ్ బాక్సర్ గా ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రం ట్రైలర్ ఎలా ఉండబోతుంది అంటే.. ట్రైలర్ లో ఎక్కువగా యాక్షన్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి అట. అదే విధంగా సినిమాలో వైల్డ్ ఫైట్స్ ఉంటాయని అంటున్నారు.
Also Read: ‘చంటి’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా ?
ఇప్పటికే బాక్సింగ్ కోట్ లో కండలు తిరిగిన దేహంతో అటు తిరిగి కనిపించిన వరుణ్ తేజ్ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. మొత్తానికి తన సిక్స్ ప్యాక్ బాడీతో సినిమా పై అంచనాలను పెంచాడు వరుణ్. అయితే, ఈ సినిమాలో బాక్సర్ పాత్రలో నటించడానికి వరుణ్ తేజ్ కఠినమైన కసరత్తులు చేయాల్సి వచ్చింది.
విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు. అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ గతంలో ‘బాలు’ అనే సినిమాలో చేసిన హీరో క్యారెక్టర్ పేరు ‘గని’నే. ఇప్పుడు వరుణ్ తేజ్, పవన్ సినిమా పేరును తన సినిమాకి టైటిల్ గా పెట్టుకోవడం విశేషం. వరుణ్ తేజ్ కి పవన్ పేర్లను వాడుకోవడం సెంటిమెంట్ అయిపోయింది. పవన్ సినిమా ‘తొలిప్రేమ’ టైటిల్ తోనే ఒక సినిమా చేసి వరుణ్ తేజ్ హిట్ కూడా కొట్టాడు.
మరి ఇప్పుడు కూడా గనితో హిట్ కొడతాడేమో చూడాలి. కాగా ఈ సినిమాను ఏప్రిల్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాతో అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మాతగా మారబోతున్నాడు. సిద్దు అనే మరో నిర్మాతతో కలిసి బాబీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాల పై ఈ సినిమా రాబోతుంది.
Also Read: ‘బాహుబలి 3’లో ఎన్టీఆర్.. ఏ పాత్రలో నటిస్తున్నాడు అంటే ?
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More