Raksha Bandhan Significance: రక్షాబంధన్ వేడుకలు ఆగస్టు 9న దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి తమ ప్రేమానుబంధాన్ని తెలిపారు. దూర ప్రాంతాల్లో ఉన్న చెల్లెళ్లు తమ పుట్టింటికి వచ్చి సోదరులకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా కొందరు సోదరులు తమ చెల్లెళ్ల కోసం విలువైన బహుమతులను అందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందాయి. అయితే రాఖీ పండుగ ఎంత నిష్టగా.. నిబంధనలతో జరుపుకున్నారో.. దానిని తీసే సమయంలో కూడా అవయ నిబంధనలు పాటించాలని కొందరు పండితులు చెబుతున్నారు. మరి రాఖీ తీసే సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించాలి అంటే?
Also Read: ఉద్యోగులకు శుభవార్త.. వ్యాపారులకు ధన లాభం.. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
రాఖీ పండుగను కూడా ఒక దైవ కార్యక్రమంలో నిర్వహించుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య నిత్యం ఆనందకరమైన వాతావరణ ఉండాలంటే దీనికి ఆధ్యాత్మిక తోడు కూడా ఉండాలని చెబుతారు. అందుకే రాఖిని ఒక శుభ ముహూర్తంలో మాత్రమే కట్టాలని కొందరు చెబుతుంటారు. ఆగస్టు 9న వచ్చిన రాఖి పండుగ రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాఖీలు కట్టుకున్నారు. అయితే చాలామంది ఈ రాఖీ కట్టగానే కాసేపటికి లేదా రాత్రి వరకు తీసేస్తూ ఉంటారు. మరికొందరు మరునాడు తీసి ఎక్కడపడితే అక్కడ పడేస్తారు. కానీ ఇలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే?
ఒక సోదరి ఎంతో ప్రేమతో తన సోదరుడి జీవితం బాగుండాలని సుదూర ప్రయాణం చేసి వచ్చి రాఖీ కడుతుంది. సోదరుడు సైతం తన చెల్లెల జీవితం బాగుండాలని కోరుకుంటారు. ఇలా ఇరువురి జీవితాలు బాగుంటే వారి తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉండగలుగుతారు. ఈ సంతోషం కలకాలం నిలవాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. చౌదరి ఎంతో ప్రేమతో కట్టిన రాఖిని వృధాగా పడేయకుండా దానిని ఒక క్రమ పద్ధతిలో తీసివేయాలని అంటున్నారు.
రాఖీ పండుగ రోజు కట్టిన రాఖిని మరునాడే కాకుండా వచ్చే శ్రీ కృష్ణాష్టమి రోజు వరకు ఉంచుకోవడం మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే కనీసం వారం రోజులపాటు చేతికి రాఖీ ఉండడంవల్ల సోదరి సోదరుల మధ్య ఉన్న అనుబంధం పెరిగిపోతుందని అంటున్నారు. అయితే మరికొందరు వీలైతే ఈ రాఖీని దసరా వరకు కూడా ఉంచుకోవచ్చని అంటున్నారు. ఇలా ఎక్కువ రోజులు చేతికి రాఖీ ఉండడంవల్ల.. తనపై ఎంతో నమ్మకం ఉందని సోదరి భావిస్తుంది. దీంతో ఇరువురి మధ్య మరింత అనుబంధం పెరిగిపోతుంది అని చెబుతున్నారు.
Also Read: సంప్రదాయినీ.. ఈ లుక్ లోనూ అనన్య అందాలు అదరహో
అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న బంధాన్ని తెలియజేసే ఈ రాకి పురాతన కాలంలో దేవుళ్ళు కూడా కట్టుకున్నారు. అందువల్ల వీటికి దైవ శక్తి కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఈ రాఖీని సాధారణంగా పడేయకుండా శ్రీకృష్ణాష్టమి రోజున ఒక చెట్టు మొదల్లో లేదా చెత్త లేని ప్రదేశంలో పడేయాలని అంటున్నారు. అలా వేయడం వల్ల ఆ రాఖికి విలువ ఉంటుందని చెబుతున్నారు.